ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం : సీఎం జగన్ దిగ్భ్రాంతి!

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం : సీఎం జగన్ దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో పోలీసులు మృతి చెందడం పట్ల సీఎం జగన్ సంతాపం
శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఘోర ప్రమాదం
ఏఆర్ పోలీసులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనానికి యాక్సిడెంట్
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లు
శ్రీకాకుళం జిల్లాలో ఘటన
నుజ్జునుజ్జయిన బొలెరో వాహనం
నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుళ్లు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం పాలవడం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు సిబ్బంది మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆర్మీ జవాను అంత్యక్రియలకు ఎస్కార్ట్ గా వెళ్లి వస్తున్న పోలీసుల వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఏఆర్ పోలీసులు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా ఘర సంఘటన చనిపోయిన పోలిసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు హోమ్ మంత్రి సుచరిత , డీజీపీ గౌతమ్ సవాంగ్ . కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: