కులాల వారీగా జనాభా లెక్కించండి: ప్రధాని మోదీని కోరిన నితీశ్!

కులాల వారీగా జనాభా లెక్కించండి: ప్రధాని మోదీని కోరిన నితీశ్
-కులాల వారీగా జనగణనకు నితీశ్ మొగ్గు
-అఖిలపక్షంతో ఢిల్లీకి!
-ప్రధాని మోదీతో సమావేశం
-భేటీలో పాల్గొన్న తేజస్వి, ఇతర నేతలు
-మీడియా సమావేశంలో పక్కపక్కనే నితీశ్, తేజస్వి

బీహార్ లో పాలక ప్రతిపక్షాలు ఒక్కటి అయ్యాయి. అందరు కలిసి ప్రధానిని కలిశారు. అందరు కలిసి కులాల వారీగా జనగణన జరగాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ అఖిలపక్ష బృందంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశంలో కులాల వారీగా జనాభా లెక్కించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తమ ప్రతిపాదనను సావధానంగా విన్నారని నితీశ్ కుమార్ వెల్లడించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

కాగా, మోదీతో భేటీకి సీఎం నితీశ్ కుమార్ తన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, ఇతర రాజకీయ పక్షాల నేతలతో కలిసి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు, మీడియా సమావేశంలోనూ నితీశ్, తేజస్వి ఒకరి పక్కన ఒకరు నిల్చున్నారు. కాగా, నితీశ్ అభిప్రాయాలను తాము సమర్థిస్తున్నామని, దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా గణన చేయాల్సిన అవసరం ఉందని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.

Leave a Reply

%d bloggers like this: