మంచిర్యాల జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్షకు షాక్ …

మంచిర్యాల జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్షకు షాక్ …
-తమ ఇంటికి రావద్దంటూ షర్మిలకు షాకిచ్చిన నిరుద్యోగి తండ్రి
-రేపు మంచిర్యాల జిల్లా లింగాపూర్ లో షర్మిల దీక్ష
-ఆత్మహత్య చేసుకున్న నరేశ్ ఇంటికి వెళ్లాల్సి ఉన్న షర్మిల
-నరేశ్ తండ్రి వ్యాఖ్యలతో పునరాలోచనలో వైయస్సార్టీపీ

వైయస్సార్ టీపీ అధినేత వై యస్ షర్మిల నిరుద్యోగుల కు నోటిఫికేషన్ లు కోసం ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ఆమె ఎదో ఒక జిల్లాను ఎంచుకొని ఉద్యోగం రాక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి ఆ గ్రామం లేదా పట్టణంలో దీక్ష చేపట్టడం అనవతిగా మారింది. అయితే రేపు మంగళవారం ఆమె మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో దీక్ష చెప్పట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామం లో ఒక నిరుద్యోగి ఉద్యోగం రాక చనిపోయారు. ఆమె షడ్యూల్ ప్రకారం లింగాపూర్ లో మరణించిన నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించి దీక్ష చేపట్టే కార్యక్రమం ఉంది. కానీ ఆ కుటుంబాన్ని ప్రరామర్శించే కార్యక్రమాన్ని కుటుంబసభ్యలు అంగీకరించలేదు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు డైలమాలో పడ్డారు. లింగాపూర్ లో దీక్ష పై సందేహాలు నెలకొన్నాయి. చనిపోయిన నిరుద్యోగి తండ్రి షర్మిల రావడాన్ని అంగీకరించడంలేదని అంటున్న ఆయనపై వత్తిడి వల్లనే షర్మిల తమ ఇంటికి రావద్దని అంటున్నట్లు వైయస్ ఆర్ టీపీ నేతలు అంటున్నారు.

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో దీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే దీక్ష కోసం తమ ఇంటికి రావద్దంటూ షర్మిలను మరణించిన నిరుద్యోగి నరేశ్ తండ్రి కోరారు. ఆయన వ్యాఖ్యలతో వైయస్సార్టీపీ నేతలు పునరాలోచనలో పడ్డారు.

నరేశ్ విషయానికి వస్తే ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. నరేశ్ ముగ్గురు అన్నలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. తనకు ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

%d bloggers like this: