Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మరో వివాదంలో జగన్ సర్కార్ ….

మరో వివాదంలో జగన్ సర్కార్ ….
-సీఎం జగన్ నివాసం సమీపంలోని భరతమాత విగ్రహం తొలగింపు.. స్థానికుల ఆగ్రహం
-తాడేపల్లిలో విగ్రహాన్ని తొలగించిన అధికారులు
-సీఎం భద్రత పేరుతో విగ్రహం తొలగింపు
-రోడ్డు పక్కనున్న విగ్రహాన్ని తొలగించాల్సి అవసరం ఏమొచ్చిందంటున్న స్థానికులు

జగన్ సర్కార్ కు వివాదాలు కొత్త కాకపోయిన ప్రతిదీ వివాదంగా మారుతుండటం గమనార్హం … రాజధాని దగ్గర నుంచి వివాదాలు అన్ని చుట్టుముడుతున్నాయి. క్లియర్ మెజార్టీ ఉన్న సర్కార్ ముందు ఆదుకు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు జరిపిన ఆపిన , ఉద్యోగులను తీసుకున్న తీసుకోకపోయినా వివాదంగా మారుతుంది. వ్యవస్థలలో పట్టు సాధించటం కోసం ఆయన అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు . ఎన్నికల కమిషన్ నియామకంలో ,ఎదురు దెబ్బలు , రాజధాని తరలింపులో సమస్యలు .గత ప్రభుత్వం చేసిన వాటిపై సమీక్షలో అడ్డంకులు ,కొత్త ఎన్నికల కమిషన్ నియామకంపై అభ్యంతరాలు , కోర్ట్ లో కేసులు ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు. తాజాగా తాడేపల్లి లో సీఎం నివాసానికి సమీపంలో భారత మాట విగ్రహం తొలగింపు వ్యవహారం వివాద స్పదం …..

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహం తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విగ్రహం తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉన్న విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి ఇంటికి భద్రత, రోడ్డు విస్తరణ పేరుతో ఈ విగ్రహాన్ని నిన్న రాత్రి అధికారులు తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో తొలగించారు. అయితే రోడ్డు మధ్యలో కాకుండా, రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు.

15 ఏళ్ల క్రితం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఇది మూడు అడుగులు ఉండేది. అయితే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ విగ్రహం స్థానంలో 15 అడుగుల సుందరమైన భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని అందంగా అలంకరించారు. ఇంతలోనే విగ్రహాన్ని అధికారులు తరలించడం వివాదాస్పదమయింది. అయితే, ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఉన్న పంప్ హౌస్ వద్ద విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామని అధికారులు చెపుతున్నారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ .. ప్రకటించిన షర్మిల!

Drukpadam

బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఆందోళ‌న‌!

Drukpadam

వాజ్‌పేయి ప్ర‌భుత్వం కూడా రాజ్యాంగ పునఃస‌మీక్ష క‌మిటీ వేసింది:వినోద్ కుమార్

Drukpadam

Leave a Comment