ఆశక్తి గొల్పుతున్న బిన్ లాడెన్ లేఖలు ….

ఆశక్తి గొల్పుతున్న బిన్ లాడెన్ లేఖలు ….
అమెరికాను మనమేమీ చెయ్యక్కర్లేదు.. బైడెన్ అధ్యక్షుడైతే చాలు, అమెరికా సర్వనాశనం: అనుచరులకు లేఖలో బిన్ లాడెన్
2006-2011 మధ్య లాడెన్ లేఖ
అసమర్థ బైడెన్ అధ్యక్షుడైతే అమెరికా సంక్షోభంలోకి
ఒబామాను మట్టుబెడితే చాలు
48 పేజీల లేఖ రాసిన ఒసామా బిన్ లాడెన్

బిన్ లాడెన్ రాసినట్లు గా చెప్పబడుతున్న లేఖలు ఆఫ్ఘన్ లో తాలిబన్ల తిరుగుబాటు అనంతరం బయటకు వస్తున్నాయి. గతంలో బిన్ లాడెన్ ను చంప వద్దని లాడెన్ లేఖరాసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బిన్ లాడెన్ అమెరికా కు అధ్యక్షుడు అయితే అమెరికా సర్వనాశనం అవుతుందని దాని సారాంశం . అయితే 48 లేఖలోనే ఈ అంశాలు ఉన్నాయా లేక వేరు వేరు లేఖలా అనేది చూడాల్సి ఉంది.

జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పదేళ్ల క్రితమే చెప్పాడా? ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి సేనలను ఉపసంహరించుకున్న తర్వాత బైడెన్ విషయంలో లాడెన్ చెప్పింది నిజం కాబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

2011లో అమెరికా బలగాలు లాడెన్‌ను మట్టుబెట్టిన తర్వాత అతడు రాసిన 48 పేజీల లేఖ లభ్యమైంది. మే 2010లో తన సోదరుడు అతియా అబ్దుల్ రహ్మాన్‌కు లాడెన్ ఈ లేఖ రాశాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సీఐఏ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్‌ల విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో సూచించిన లాడెన్.. బైడెన్‌ జోలికి వెళ్లొద్దని మాత్రం హెచ్చరించాడు.

ఒబామాను చంపేస్తే బైడెన్ అధ్యక్షుడవుతాడని, ఆయన అధ్యక్షుడయ్యాడంటే మన కల నెరవేరినట్టేనని పేర్కొన్నాడు. అధ్యక్ష పదవికి బైడెన్ పూర్తిగా అసమర్థుడని, ఆయన హయాంలో అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుందని, అతడితోనే అమెరికా పతనం ప్రారంభమవుతుందని ఆ లేఖలో లాడెన్ పేర్కొన్నాడు. కాబట్టి బైడెన్‌కు ఎలాంటి హానీ తలపెట్టవద్దని 48 పేజీలున్న ఈ లేఖలో తన అనుచరులకు సూచించాడు.

ఆ లేఖలోని 36వ పేజీలో రెండు హిట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్న తన కోరికను లాడెన్ వెల్లడించాడు. అందులో ఒకటి పాకిస్థాన్‌లో, మరోటి ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పాటు చేయాలన్నాడు. ఈ రెండూ ఒబామా, సీఐఏ డైరెక్టర్‌ల హత్యకు పథక రచన చేయాలని కోరాడు. 2012లో తొలిసారి ఈ లేఖ వెలుగులోకి రాగా, ఇప్పుడు ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో మరోమారు వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

%d bloggers like this: