కొనసాగుతున్న ఆఫ్ఘన్ సంక్షోభం …ప్రపంచదేశాలు సమాలోచనలు!

కొనసాగుతున్న ఆఫ్ఘన్ సంక్షోభం …ప్రపంచదేశాలు సమాలోచనలు!
-ఆఫ్ఘన్ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ సుదీర్ఘ చర్చ
-జి -7 దేశాల సమావేశంలో చర్చిస్తామన్న ట్రూడో
-ఆఫ్ఘన్ లో మళ్లీ తాలిబన్ల పాలన
-ఆందోళనలో ప్రపంచ దేశాలు
-పరిష్కారం కోసం పుతిన్ తో మోదీ చర్చ
-45 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ

ఆఫ్ఘన్ లో కొనసాగుతున్న సంక్షోభం పై ప్రపంచదేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాలిబన్ల పాలనను సమర్థించటమా? లేక వ్యతిరేకించటమా?అనే సందిగ్ధంలో కొన్ని దేశాలు ఉండగా మరికొన్ని దేశాలు తాలిబన్ల కు బాసటగా నిలిచాయి. భారత్ వైఖరి ఇంకా వెల్లడి కానప్పటికీ ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమాలోచనలు జరిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాలిబన్లను ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని చెబుతూ జి -దేశాల సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం తాలిబన్ల పాలనా కూడా చూడాల్సిఉందని అన్నారు .

ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ తాలిబన్లు అధికారం చేపట్టనుండడంపై ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా చర్చించారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారంపై పుతిన్ తో ఫోన్ లో దాదాపు 45 నిమిషాల సేపు సమాలోచనలు జరిపారు. వీరి సంభాషణలో ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారమే ప్రధాన అజెండాగా ఉంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు.

“ఆఫ్ఘనిస్థాన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై నా మిత్రుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఎంతో ఉపయుక్తమైన, వివరణాత్మక సంభాషణ జరిపాను. అంతేకాకుండా భారత్-రష్యా ద్వైపాక్షిక అంశాలపైనా మాట్లాడుకున్నాం. కొవిడ్-19కు వ్యతిరేకంగా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడంపైనా చర్చించాం. కీలక అంశాలపై ఇకపైనా దేశాధినేతల స్థాయిలో చర్చలు జరపడం కొనసాగించాలని తీర్మానించాం” అని వివరణ ఇచ్చారు.

ఆఫ్ఘనిస్థాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్
తమ దేశస్తులను తీసుకెళ్లడానికి ఆఫ్ఘనిస్థాన్ కు వచ్చిన ఉక్రెయిన్ విమానం
నిన్న విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు
ఈరోజు ఇరాన్ కు తీసుకెళ్లిన వైనం

ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారడంతో దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఎంతో మంది యత్నిస్తున్నారు. మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని… బతుకులు మళ్లీ దుర్భరంగా మారతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. భయపడినట్టుగానే అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. తాలిబన్లు ఓవైపు శాంతి వచనాలు పలుకుతూనే… మరోవైపు ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారు. మహిళలపై షరియా చట్టాల పేరుతో ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ లో ఉక్రెయిన్ కు చెందిన విమానాన్ని హైజాక్ చేయడం కలకలం రేపుతోంది.

తమ దేశ ప్రజలను తీసుకెళ్లేందుకు ఉక్రెయిన్ కు చెందిన విమానం ఆఫ్ఘనిస్థాన్ కు వచ్చింది. అయితే ఆయుధాలతో వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ విమానాన్ని హైజాక్ చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్ జెనీ యెనిన్ తెలిపారు. విమానాన్ని నిన్న హైజాక్ చేశారని… ఈరోజు దాన్ని దొంగిలించి ఇరాన్ కు తీసుకెళ్లారని చెప్పారు. విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా తమ దేశస్తులు కాదని… వేరే ప్రయాణికులను తీసుకుని వెళ్లారని తెలిపారు. విమానం హైజాక్ కావడం వల్ల తమ దేశస్తుల తరలింపుకు ఆటంకం కలిగిందని చెప్పారు.

‘ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి’ చేప‌ట్టిన భార‌త్.. ఆఫ్ఘ‌న్ నుంచి మ‌రో 78 మంది త‌ర‌లింపు..
ఆఫ్ఘనిస్థాన్ లో రెచ్చిపోతోన్న‌ తాలిబ‌న్లు
భార‌త్ వ‌స్తోన్న 78 మందిలో 25 మంది భార‌తీయులు
దుషన్బే మీదుగా తీసుకొస్తున్న అధికారులు

 

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబ‌న్లు రెచ్చిపోతుండ‌డంతో ఆ దేశ రాజ‌ధాని కాబూల్ లోని విమానాశ్ర‌యం నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు భార‌త్ చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ దేవి శ‌క్తిగా పేరు పెట్టింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ట్వీట్ చేశారు.

ఈ రోజు భార‌తీయులు స‌హా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి త‌జ‌కిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ చేప‌డుతోన్న భార‌త వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

కాగా, దుషన్బే నుంచి భార‌త్ కు 25 మంది భార‌తీయులు స‌హా 78 మంది విమానంలో బ‌య‌లుదేరిన వీడియోను ఓ అధికారి పోస్ట్ చేశారు. మరోపక్క, ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌సిద్ధ గ‌జిని ప్రావిన్స్ గేటును తాలిబ‌న్లు కూల్చివేశారు. ఇందుకు స‌బంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Leave a Reply

%d bloggers like this: