గాయపడ్డ అభిషేక్ బచ్చన్.. ఆసుపత్రికి వెళ్లిన అమితాబ్, శ్వేత!

గాయపడ్డ అభిషేక్ బచ్చన్.. ఆసుపత్రికి వెళ్లిన అమితాబ్, శ్వేత

  • ‘బాబ్ విశ్వాస్’ చిత్రంలో నటిస్తున్న అభిషేక్
  • షూటింగ్ సమయంలో ప్రమాదం
  • ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గాయపడ్డాడు. ‘బాబ్ విశ్వాస్’ సినిమాలో నటిస్తున్న అభిషేక్… షూటింగ్ సమయంలో గాయపడినట్టు చెపుతున్నారు. ప్రమాదంలో అభిషేక్ కు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. వీరు ఆసుపత్రికి వచ్చినప్పుడు పాపరాజీలు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆసుపత్రికి అభిషేక్ భార్య ఐశ్వర్య రాయ్ వచ్చినట్టు మాత్రం సమాచారం లేదు. మరోవైపు అభిషేక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ లు పెడుతున్నారు.

Leave a Reply

%d bloggers like this: