రెండు వేరు వేరు కోర్ట్ తీర్పులు …..

రెండు వేరు వేరు కోర్ట్ తీర్పులు …..
అత్యాచార బాధితురాలు, అత్యాచార నిందితుడిని ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించిన న్యాయమూర్తి!
మద్యం తాగించి అత్యాచారం చేశాడని యువతి ఆరోపణ
బెయిలు విచారణ సందర్భంగా జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు
బెయిలు మంజూరు

అసోం లో

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని, అత్యాచార బాధితురాలిని ప్రతిభావంతులుగా, ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించిన గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించి, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘బాధితురాలు, నిందితుడు ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు ప్రతిభావంతులనీ, ‘దేశ భవిష్యత్ సంపద’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు.

తెలంగాణాలో

సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.. జైలు శిక్ష నుంచి ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఊరట
కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు
2009 నాటి స్టే ఉత్తర్వులపై ఇప్పుడు ధిక్కరణ పిటిషన్ ఏంటని ప్రశ్న
కాలపరిమితి ముగియడంతో సింగిల్ జడ్జ్ తీర్పును కొట్టేసిన ధర్మాసనం

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఎస్ఎస్, ఇద్దరు ఐఎఫ్ఎస్ సహా ఆరుగురు అధికారులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వీరిలో అటవీ సంరక్షణశాఖ ప్రధానాధికారి ఆర్.శోభ, రంగారెడ్డి జిల్లా సీసీఎఫ్ సునీత, ఎం. భగవత్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతకుమారి, రంగారెడ్డి కలెక్టర్ డి.అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి ఎస్.తిరుపతిరావు, రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి జానకీంరామ్‌ ఉన్నారు.

ఓ కేసు విచారణలో కోర్టు ధిక్కరణ కింద ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జులైలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. 2009లో ఇచ్చిన స్టే ఉత్తర్వులపై 2015లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. కాలపరిమితి ముగియడంతో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోలేమంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

Leave a Reply

%d bloggers like this: