తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు: సీఎస్ సోమేశ్ కుమార్!

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు: సీఎస్ సోమేశ్ కుమార్!
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
హైదరాబాదులో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాం
వ్యాక్సిన్ వేయించుకోవడంలో అలసత్వం వద్దు

ప్రపంచం అంతా కరోనా థర్డ్ వేవ్ ,ఫోర్త్ వేవ్ గురించి హెచ్చరికలు జారీచేస్తుండగా తెలంగాణాలో మాత్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని అంటున్నారు అధికారులు …. థర్డ్ వేవ్ అక్టోబర్ లో వస్తుందని అది భయంకరంగా ఉంటుందని కొందరు నిపుణులు చెపుతుండగా తెలంగాణ అధికారులు థర్డ్ వేవ్ తెలంగాణకు వచ్చే అవకాశం లేదని చెప్పటం చర్చనీయాంశం అయింది. నిజంగా తెలంగాణకు థర్డ్ వేవ్ రాకూడదని కోరుకుందాం . కానీ అందుకు భిన్నంగా జరిగితే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ థర్డ్ వేవ్ వచ్చిన అందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది.

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఒకవేళ వచ్చినా ఎలాంటి పరిస్థితినైనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 27 వేల బెడ్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో ఏడు వేల పడకలను సిద్ధం చేస్తామని చెప్పారు.

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే క్రమంలోనే హైదరాబాదులో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. హైదరాబాదులో తప్ప మన దేశంలోని మరే నగరంలో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టలేదని చెప్పారు. 15 రోజుల్లో 100 శాతం మందికి కనీసం తొలి డోసు వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఎవరూ అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు.

థర్డ్ వేవ్ వచ్చినా అందుకు తగ్గట్లు బెడ్స్ , సిబ్బంది. ఏర్పాటు చేసినట్లు సి ఎస్ తెలిపారు. థర్డ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: