త్వరలో టీఆర్ యస్ ద్విదశాబ్ది ఉత్సవాలు…రాష్ట్ర సమావేశంలో నిర్ణయం…

త్వరలో టీఆర్ యస్ ద్విదశాబ్ది ఉత్సవాలు…రాష్ట్ర సమావేశంలో నిర్ణయం…
-అతికొద్ది కాలంలో అద్భుత విజయాలు సాధించిన పార్టీగా టీఆర్ యస్ రికార్డు
-సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం
-తెలంగాణ భవన్ లో రాష్ట్ర కమిటీ భేటీ
-పలు కీలక ప్రతిపాదనలకు కేసీఆర్ ఆమోదం
-నవంబరులో కానీ, డిసెంబరులో కానీ పార్టీ ప్లీనరీ
-రెండు దశాబ్దాల ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయాలు సాధించింది: కేటీఆర్
-హైదరాబాదులో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం
-కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
-హాజరైన కేటీఆర్ భేటీ వివరాల వెల్లడి

హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు దశాబ్దాల పార్టీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నవంబరులో కానీ, డిసెంబరులో కానీ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

మండల, మున్సిపల్, జిల్లా కమిటీలతో సహా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని సంకల్పించారు. సీనియర్ నేత కె.కేశవరావు పార్టీ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 2న పంచాయతీ కమిటీలను ప్రకటించనున్నారు.

విజయదశమి అనంతరం అక్టోబరులో జిల్లాల్లోని టీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అయితే, హైదరాబాద్, వరంగల్ జిల్లాల పార్టీ కార్యాలయాలను అందుకు మినహాయించారు. ఇక ఆగస్టు చివరినాటికి పార్టీ సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

టీఆర్ యస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశ వివరాలు వెల్లడించిన కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు దశాబ్దాల ప్రస్థానంలో టీఆర్ఎస్ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ రాజకీయ శక్తిగా అవతరించిందని తెలిపారు.

దసరా నాటికి జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభిస్తామని, ఢిల్లీలోనూ తెలంగాణ భవన్ నిర్మిస్తామని వివరించారు. సెప్టెంబరు 2న ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. దళితబంధుపై ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: