అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు… హోరెత్తనున్న ప్రచారం !

‘మా’ ఎన్నికల తేదీ ఖరారు.. హోరెత్తనున్న ప్రచారం
అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు
అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు
అసోసియేషన్ శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా జరగనున్న ఎన్నికలు

‘మా’ ఎన్నికల తేదీ ఖరారుమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారయింది. ఎన్నికలను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వేడి రజుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. నామినేషన్ల ఆఖరు తేదీ నాటికి ఇంకా ఎవరైనా బరిలోకి దిగుతారా? అనే ఉత్కంఠ ఉంది. ‘మా’ శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఇంతకు ముందు మంచు విష్ణు మాట్లాడుతూ, ఏకగ్రీవ ఎన్నికలకు అందరూ అంగీకరిస్తే… తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఎన్నికల తేదీ వెలువడిన నేపథ్యంలో ప్రచారపర్వం ప్రారంభం కానుంది. అభ్యర్థులు, వారి ప్యానల్స్ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ తో మరింత రసవత్తరంగా మారింది. సినీ రంగంలోని ప్రముఖులు నేరుగా మద్దతు ప్రకటించాక పోయిన వెనక ఉంది కథ ,స్క్రీన్ ప్లే పోషిస్తున్నారు. ఇటీవలనే జరిగిన మా సర్వసభ్య సమావేశంలో వేడివేడిగా చర్చలు జరిగాయి. ఈసారి వాతారణం మరింత వేడెక్కనున్నది. ఎవరు ఎవరికీ మద్దతుగా ఉంటున్నారు అనేది ఇప్పటికే తేలిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే హోరాహోరీ గా జరిగే ఈ ఎన్నికల్లో ఇప్పటికైతే ప్రకాష్ రాజ్ ప్యానల్ అందరి అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. మిగతా వాళ్ళు తమ ప్యానల్ ప్రకటించలేదు. అయితే మంచు విష్ణు కు కొంత పట్టు ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పటికి అధ్యక్ష బరిలో నలుగురు ఉన్నారు. ఇనక ఎంతమంది ఉంటారు అనేది తేలనుంది.

Leave a Reply

%d bloggers like this: