అమ్మడానికి ఇవి మోదీ ఆస్తులో, బీజేపీ ఆస్తులో కావు: మమత బెనర్జీ

అమ్మడానికి ఇవి మోదీ ఆస్తులో, బీజేపీ ఆస్తులో కావు: మమత బెనర్జీ
-దేశ ఆస్తులను ఇష్టానుసారం అమ్మడం కుదరదు
-ఎన్ఎంపీ పాలసీ దురదృష్టకరం
-కేంద్రం నిర్ణయాన్ని అందరం సమష్టిగా ఎదుర్కోవాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపీ) పాలసీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి రెచ్చిపోయారు. కేంద్రం చేస్తున్న ప్రవేటీకరణ విధానంపై విమర్శలు గుప్పించారు. అమ్ముకోవడానికి దేశ ఆస్తులేమీ మోదీ సొంత ఆస్తులో, బీజేపీ ఆస్తులో కాదని ఆమె మండిపడ్డారు. దేశ ఆస్తులను ఇష్టానుసారం అమ్మడం కుదరదని అన్నారు. వాటికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న సంగతి బీజేపీ కి తెలియదా అని ఆమె ప్రశ్నించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపీ) పాలసీ పేరుతొ ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి అధికారం ఎవరిచ్చారని అన్నారు. ఎలాంటి చర్యలను ప్రజలు సహించరాని పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాపితంగా దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్న విషయాన్నీ ఆమె గుర్తు చేశారు.

ఎన్ఎంపీ పాలసీ నిర్ణయం దురదృష్టకరమని, తమకు షాక్ కలిగించిందని మమత చెప్పారు. ఈ ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో విపక్షాలను ఓడించేందుకు వినియోగిస్తారని ఆరోపించారు. కోల్ కతాలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఈ నిర్ణయాన్ని యావత్ దేశం ఐకమత్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్ఎంపీ పాలసీ ద్వారా రూ. 6 లక్షల కోట్ల వరకు డబ్బును సమీకరిస్తామని గత సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: