ఎన్టీఆర్‌కు నమస్కారం చేయాలి.. సోనియమ్మకు థ్యాంక్స్ చెప్పాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎన్టీఆర్‌కు నమస్కారం చేయాలి.. సోనియమ్మకు థ్యాంక్స్ చెప్పాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-నక్సల్స్‌ను ఎన్టీఆర్‌ దేశభక్తులన్నారు.. అది సరైన భావజాలం
-కేసీఆర్‌కు తన, మన భేదం లేదు
-మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారు
-తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు థ్యాంక్స్

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఏది చేసిన మాట్లాడిన సంచలనమే …. గతంలో కూడా డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఓట్లు వేయరు టీఆర్ యస్ పార్టీగా మేముకూడా డబ్బులు ఇస్తాం అని ఒక సమావేశంలో అన్నారు. దానిపై ఆయన ఆ తరువాత వివరణ ఇచ్చారు . తరువాత అనేక సందర్భాలలో ఆయన మాటలు వివాద స్పదం అయ్యాయి. అయితే ఆయన మనసులో ఏది ఉన్న దాచుకోకుండా మాట్లాడతారని పేరుంది. ఇటీవల ఆయన గ్రామాలలో పార్టీటిస్తున్న సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి టీఆర్ యస్ అభ్యర్థిగా పోలిచేసిన మదన్ లాల్ పై విజయం సంధించారు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి గెలవడం ఒక రికార్డు . గెలిచినా తరువాత ఆయన టీఆర్ యస్ లో చేరారు. నియోజకవర్గంలో తన పర్యటనలో ఆయన ఎన్టీఆర్ ,సోనియాగాంధీలపై ప్రసంశలు కురిపించారు. రాములు నాయక్ ఇంతకీ టీఆర్ యస్ లోనే ఉన్నారా లేక స్వతంత్రంగా ఉన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

నక్సల్స్‌ను దేశభక్తులన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు నమస్కారం చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి థ్యాంక్స్ చెప్పాలని ఖమ్మం జిల్లా వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. జిల్లాలోని బొక్కలతండాలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలకు అతీతంగా ‘కల్యాణ లక్ష్మి’ చెక్కులు పంపారని అన్నారు.

కేసీఆర్‌కు తన, మన భేదం లేదని, ఆయన అందరి గురించి ఆలోచిస్తారని అన్నారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి అదే కారణమన్నారు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని రాములు నాయక్ జోస్యం చెప్పారు. పనిలో పనిగా ఎన్టీరామారావు, సోనియాగాంధీలను కూడా ప్రశంసించారు. నక్సల్స్‌ను దేశభక్తులుగా అభివర్ణించిన ఎన్టీఆర్‌కు నమస్కారం చేయాలని అన్నారు. అదే సరైన భావజాలమని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి థ్యాంక్స్ చెప్పాలని పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: