పోలీసులు అధికార పార్టీలకు కొమ్ముకాయడంపై సుప్రీం చురకలు !

పోలీసులు అధికార పార్టీలకు కొమ్ముకాయడంపై  సుప్రీం చురకలు 
-చత్తీస్ గఢ్ పోలీసు అధికారి కేసులో సుప్రీం వ్యాఖ్యలు
-పోలీసు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి
-నేతల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య
-అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆరోపణ

పోలీస్ అధికారుల తీరుపై సుప్రీం ధర్మాసనం చురకలు అంటించింది. అధికార పార్టీ ఏజంట్లు లాగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని దేశ అత్యోన్నత న్యాయస్థానం ఘాటుగానే స్పందించింది. చత్తీస్ గఢ్ పోలీసు అధికారి కేసు సందర్భంగా పోలిసుల తీరుపై ఈ వాక్యాలు చేసిన సుప్రీం దేశంలో వివిధ రాష్ట్రాలలో తరతమ స్థాయిలలో ఇదే జరుగుతున్న ఈవిషయాన్ని గుర్తించింది. అనేక ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే లు ఇచ్చిన లేఖల ఆధారంగా పోలిసుల పోస్టింగులు ఇస్తున్న విషయం సుప్రీం దృష్టికి ఇంకా రాకపోవచ్చు . అధికార పార్టీ కనుసన్నలలో ప్రజలపై ఖాకీలు కర్కశంగా వ్యవహరించడం నిజంగా ఇబ్బంది కారమే …సుప్రీం చురకతోనైనా పోలీసులు మారతారో లేదో చూడాలి ….సుప్రీం వ్యాఖ్యలు ఒకరకంగా పోలీసులు తీరుకు అద్దం పడుతుంది. వివరాలు చూద్దాం …

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొందరు పోలీసు అధికారుల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొంతమంది పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం ఏంచేసేందుకైనా సిద్ధపడుతున్నారని పేర్కొంది. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజలకు సేవలు అందించాల్సిన పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాయడం కలవరపరిచే అంశం అని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తుండడం దురదృష్టకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి దుస్సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

చత్తీస్ గఢ్ కు చెందిన ఓ పోలీసు అధికారికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు కచ్చితంగా చట్టానికి లోబడి వ్యవహరించాలని స్పష్టం చేసింది.

Leave a Reply

%d bloggers like this: