కాబూల్ పేలుళ్లు మా పనే: ప్రకటించిన ఐసిస్…ప్రతీకారం తప్పదన్న బైడెన్…

కాబూల్  పేలుళ్లు మా పనే: ప్రకటించిన ఐసిస్…ప్రతీకారం తప్పదన్న బైడెన్…
-ఆత్మాహుతి బాంబర్ ఫొటో విడుదల
-12 మంది అమెరికా రక్షణ సిబ్బంది సహా 90 మంది దుర్మరణం
-మరో 143 మందికి గాయాలు: మరి కొందరి పరిస్థితి సీరియస్

కాబూల్‌లో రక్తపాతం సృష్టించిన వరుస పేలుళ్లు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది సహా మొత్తం  120  మంది వరకు చనిపోయారు. మరో 143 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తొలుత విమానాశ్రయం వద్ద కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగ్గా ఆ తర్వాత కొన్ని గంటలకు సెంట్రల్ కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాజాగా ప్రకటించిన ఐసిస్.. అబే గేటు వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్ ఫొటోను విడుదల చేసింది.

కాబూల్ పేలుళ్ల ఘటనలో  120 కి పెరిగిన మృతుల సంఖ్య
నిన్న పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్
ఎయిర్ పోర్టు గేటు, హోటల్ వద్ద పేలుళ్లు
తమ పనే అని ప్రకటించుకున్న ఐసిస్

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో నిన్న జరిగిన జంటపేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య  120 కి పెరిగింది. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గేటు వద్ద జనంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దాడులు జరగడం తెలిసిందే. తొలి పేలుడు ఎయిర్ పోర్టులోని అబ్బే గేటు వద్ద జరగ్గా, రెండో పేలుడు బేరన్ హోటల్ వద్ద చోటుచేసుకుంది.

మృతుల్లో అమెరికా మెరైన్ కమాండోలు కూడా ఉండడం పట్ల పెంటగాన్ వర్గాలు ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమిస్తున్న తరుణంలో అమెరికా అధినాయకత్వాన్ని రెచ్చగొట్టే చర్యగా రక్షణ రంగ నిపుణులు ఈ పేలుళ్లను అభివర్ణిస్తున్నారు. ఈ ఘాతుకం తమ పనే అని ఐసిస్ ఇప్పటికే ప్రకటించుకుంది.

నిజానికి ఈ పేలుడు ఘటనపై అమెరికా నిఘా వర్గాలు ముందే అప్రమత్తం అయ్యాయి. ఘటనకు కొన్ని గంటల ముందే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. అయితే, ఈ ఘటనకు కారకులపై ప్రతీకారం తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా, అది ఏ రూపంలో అన్నది స్పష్టత రాలేదు. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా బలగాలు కొనసాగడం అనేది ఏమాత్రం సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఐసిస్ పై బైడెన్ ప్రతీకారం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

జో బైడెన్ ప్రతీకారేచ్ఛ.. కాబూల్ పేలుళ్ల కారకులను వెంటాడి మరీ మట్టుబెడతామని ప్రతిన
నిన్నటి దాడిలో 12 మంది అమెరికా సైనికులు సహా 72 మంది దుర్మరణం
ఇతరుల కోసం అమెరికా తన ప్రాణాలను పణంగా పెడుతోందన్న బైడెన్
మరణించిన సైనికులను హీరోలుగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు

కాబూల్ విమానాశ్రయం వెలుపల జరిగిన వరుస ఉగ్రపేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించిన ఆయన.. ఇంతకింత ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్ల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి మరీ మట్టుబెడతామన్నారు. ఐసిస్ నేతలను హతమార్చాలని బలగాలను ఆదేశించారు. తమ మిషన్ కొనసాగుతుందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులను తరలిస్తామని బైడెన్ స్పష్టం చేశారు.

కాబూల్ విమానాశ్రయం బయట జరిగిన ఉగ్రదాడిలో తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్టు ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని బైడెన్ పేర్కొన్నారు. తాము ప్రమాదకర మిషన్‌ను కొనసాగిస్తున్నామని, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా తన ప్రాణాలను పణంగా పెడుతోందన్నారు. ఈ నెల 31న గడువు తేదీ నాటికి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని బైడెన్ పునరుద్ఘాటించారు. కాబూల్ ఆత్మాహుతి దాడి ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 12 మంది తమ సైనికులు ఉన్నట్టు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: