Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈ విషయంలో న్యూయార్క్, లండన్, షాంఘైలను కూడా అధిగమించిన ఢిల్లీ!

ఈ విషయంలో న్యూయార్క్, లండన్, షాంఘైలను కూడా అధిగమించిన ఢిల్లీ
-సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీకి అగ్రస్థానం
-రెండో స్థానంలో లండన్
-మూడో స్థానంలో చెన్నై

పెరుగుతున్న టెక్నాలజీ ని ప్రపంచమంతా అంది పుచ్చుకుంటుంది . అయితే అగ్రరాజ్యాలను సైతం తలదన్ని మనదేశంలో టెక్నాలజీ ఉపయోగం గుర్తించారు. ఇప్పటికే అనేక నేరాలలో ఉపయోగపడుతున్న సీసీ కెమెరాలను మనమే అధికంగా ఉపయోగిస్తున్నామనే విషయం గర్వించదగినదే .అందులో మాదేశ రాజధాని ఢిల్లీ నగరం లో ప్రపంచంలో అత్యధికంగా సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్న నగరాలలో నుంబర్ వన్ గా నిలిచింది.

భారతీయులంతా గర్వించే ఘనతను మన దేశ రాజధాని ఢిల్లీ సాధించింది. సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో అగ్రదేశాల్లోని న్యూయార్క్, లండన్, షాంఘై వంటి నగరాలను ఢిల్లీ అధిగమించింది. బహిరంగ ప్రదేశాల్లో అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా ఘనతను సాధించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. దీనికి ఫోర్బ్స్ ఇండియాను ప్రతిపదికగా చూపించారు.

ఢిల్లీ ఈ ఘనతను సాధించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి చదరపు మైలుకు సరాసరిన 1826 సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. లండన్ లో 1138, ఇతర నగరాల్లో అంతకంటే తక్కువ ఉన్నాయని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించినందుకు ఇంజినీర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఢిల్లీలో మొత్తం 2.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆప్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ బాధ్యతను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. 2019 డిసెంబర్ నాటికే 1.05 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది.

ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో, రెండో స్థానంలో లండన్ ఉండగా… మూడో స్థానంలో మళ్లీ మన దేశానికి చెందిన నగరమే నిలిచింది. చెన్నై మూడో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నైలో ప్రతి చదరపు మైలుకు 609 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ జాబితాలో మన దేశ ఆర్థిక రాజధాని ముంబై 18వ స్థానంలో నిలిచింది.

Related posts

మెక్సికోలో ఘోర ప్రమాదం.. 27 మంది మృతి…

Drukpadam

ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు….

Drukpadam

అమెరికాలో అంతర్యుద్ధం తప్పదు..రష్యా మాజీ అధ్యక్షుడి జోస్యం…

Drukpadam

Leave a Comment