Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంతకీ హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆమేనా ?

ఇంతకీ హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆమేనా ?
-ఆమె పేరు ముందు వరసలో ఉన్న మరికొందరి పేర్లు పరిశీలన
-ఎల్లుండి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
-ఈ నెల 30న మాణికం ఠాగూర్ నేతృత్వంలో కాంగ్రెస్ సమావేశం
-ఆ తర్వాతే అభ్యర్థి పేరు ప్రకటన
-ఇప్పటికే పరిశీలనలో పలువురి పేర్లు
-కొండా సురేఖవైపే అధిష్ఠానం మొగ్గు

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీగా పేరుంది. …. తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ లో జరగనున్న ఉపఎన్నికల్లో పోటీకి అభ్యర్థి వేటలో ఉన్న పార్టీ …. అంతకుముందు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి టీఆర్ యస్ లో చేరారు. దీంతో అభ్యర్థుల వేటలో ఉన్న కాంగ్రెస్ కు పక్క జిల్లాలో డైనమిక్ లేడీగా పేరున్న కొండా సురేఖ పేరు ను దాదాపు ఖరారు చేసినట్లు చెబుతున్న మరో రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. స్థానికులకు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. అంతే కాకుండా టీఆర్ యస్ దళిత బందు పేరుతొ ఈ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేయించుకోవాలని చూస్తున్నందున దళిత అభ్యర్థిని రంగంలోకి దించితే ఎలాఉంటున్నదనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఈ నెల 30న తమ అభ్యర్థిని ప్రకటించనుంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో అదే రోజు జరగనున్న విస్తృతస్థాయి కోర్ కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు కొండా సురేఖ ఇప్పటికే ముందుకు రాగా, పార్టీ కూడా ఆమెనే పోటీలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొండా సురేఖ పేరుతోపాటు కరీంనగర్, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కొమరయ్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, స్థానిక నేతలైన పత్తి కృష్ణారెడ్డి, రవీందర్ పేర్లను కూడా పరిశీలించినప్పటికీ కొండా సురేఖకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు సమాచారం.

మరోవైపు, టీఆర్ఎస్ ఇప్పటికే గెల్లు శ్రీనివాస యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ నుంచి ఈటల బరిలో ఉన్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగితే పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Related posts

ఉదయం 11 గంటలకు బీజేపీలోకి ఈటల.. సర్వం సిద్ధం!

Drukpadam

మూడవ ఫ్రంట్ ఓల్డ్ మోడల్ … ప్రజలు దాన్ని విశ్వశించకపోవచ్చు :ప్రశాంత్ కిశోర్!

Drukpadam

జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ కు షాక్ ఇచ్చిన అనుయాయులు !

Drukpadam

Leave a Comment