ఆఫ్ఘన్ తిరుగుబాటు… పంజ్ షీర్ లో భీకర యుద్ధం తాలిబన్లను అడుగుపెట్టనీయని సాయుధులు…

ఆఫ్ఘన్ తిరుగుబాటు… పంజ్ షీర్ లో భీకర యుద్ధం తాలిబన్లను అడుగుపెట్టనీయని సాయుధులు…

– తిరుగుబాటు ద‌ళం కీల‌క‌ ప్ర‌క‌ట‌న
-పంజ్‌షీర్‌లోకి ప్ర‌వేశించామ‌న్న తాలిబ‌న్లు
-ఖండించిన అక్కడి తిరుగుబాటు ద‌ళం
-ఎలాంటి పోరాట‌మూ జ‌ర‌గ‌లేద‌ని వ్యాఖ్య‌
-తాలిబ‌న్ల‌కు కొర‌కరాని కొయ్య‌గా మారిన పంజ్‌షీర్

ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తోన్న తాలిబ‌న్ల‌కు పంజ్‌షీర్ నుంచి మాత్రం గ‌ట్టి ఎదుర‌దెబ్బ త‌గులుతోన్న విష‌యం తెల‌తిసిందే. తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌లోని అన్ని ప్రాంతాల్లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు పంజ్‌షీర్‌ లోయ‌ను మాత్రం త‌మ అధీనంలోకి తెచ్చుకోలేక‌పోయారు. ఇందుకు కార‌ణం అక్క‌డి ప్ర‌జ‌లు, సైన్యం చూపుతోన్న ధైర్య‌సాహ‌సాలే.

తాలిబ‌న్ల‌కు లొంగబోమ‌ని చెబుతూ వారు పోరాడుతోన్న తీరు ప‌ట్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపున‌కు తాలిబన్లు క‌దులుతున్నారు. తాము పంజ్‌షీర్‌లోకి ఇప్ప‌టికే ప్ర‌వేశించామ‌ని తాలిబ‌న్లు తాజాగా ప్ర‌క‌టించారు. అయితే, త‌మ‌కు ఆ ప్రాంతం కొరకరాని కొయ్యగా మారడంతోనే తాలిబ‌న్లు ఈ విధంగా మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేశార‌ని తెలుస్తోంది.

తాలిబ‌న్లు అస‌త్య ప్ర‌క‌ట‌న చేశార‌ని పంజ్‌షీర్ లోయ‌లోకి ఇప్పటివరకు ఒక్క తాలిబన్ కూడా ప్ర‌వేశించ‌లేద‌ని అహ్మ‌ద్ మ‌సూద్ నేతృత్వంలోని అక్క‌డి సైన్యం (తిరుగుబాటు ద‌ళం) ప్ర‌క‌టించింది. పంజ్‌షీర్ పై ఎటువంటి పోరాటమూ జరగలేదు. ఈ ప్రావిన్స్‌లోకి ఎవరూ అడుగుపెట్టలేదు అని తిరుగుబాటు ద‌ళ నేత మహ్మద్ అల్మాస్ జాహిద్ ఓ వార్తా చానెల్‌కు తెలిపారు.

తాలిబ‌న్ నేత‌లు కొంద‌రు మాత్రం పంజ్‌షీర్ ప్రావిన్స్ పై మ‌రోలా ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. అక్క‌డ ఎలాంటి పోరాటం యుద్ధం జరగలేదు. అయితే, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్‌ ఆఫ్ఘ‌నిస్థాన్ (ఆఫ్ఘ‌నిస్థాన్‌కు తాలిబ‌న్లు పెట్టుకున్న పేరు)కు చెందిన ముజాహిద్దీన్ స‌భ్యులు ప‌లు మార్గాల్లో ఆ ప్రాంతంలోకి ప్ర‌వేశించారు. వారికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు అని తాలిబన్ సాంస్కృతిక కమిటీ సభ్యుడు అనాముల్లా సమంఘాని తెలిపారు.

గ‌తంలో తాలిబ‌న్ల‌పై పోరాడి గెలిచిన‌ ఆర్మీ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ తో పాటు, ఆఫ్ఘ‌న్‌కు అధ్యక్షుడిగా స్వ‌యం ప్ర‌క‌ట‌న చేసుకున్న ఆ దేశ‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కలిసి పంజ్‌షీర్‌లో తాలిబన్లను వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నారు. కాబూల్ నుంచి పంజ్‌షీర్ లోయ 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

Leave a Reply

%d bloggers like this: