మంత్రుల పర్యటనల్లో జేబు దొంగలు…

మంత్రుల పర్యటనల్లో జేబు దొంగలు
-దొంగల హల్​ చల్​.. నేతల జేబులు గుల్ల
-యాదాద్రి జిల్లా మోత్కూరులో ఘటన
– మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
-జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరు
-వారికి స్వాగతం పలికిన స్థానిక నేతలు
-మధ్యలో దూరి జేబులు కొట్టేసిన దొంగలు
-శాలిగౌరారంలోనూ ఘటన

అది మంత్రుల కార్యక్రమం.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. అలాంటి చోట కూడా జేబు దొంగలు చెలరేగిపోయారు. మంత్రులతో ఉన్న నేతల మధ్య చొరబడి నగదు దొంగిలించారు. దాదాపు రూ. లక్ష వరకు కొట్టేశారు. నిన్న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడదు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. మంత్రులను కలుసుకునేందుకు పోటీలు పడ్డారు. కరోనా ను సైతం లెక్క చేయకుండా ఒకరిపై ఒకరు తుసుకుంటూ మంత్రుల పర్యటనలో హంగామా చేశారు. కార్యకర్తల హంగామా ఒకవైపు ఉండగా మరో వైపు దొంగలు వారిపని వారు కానిచ్చారు. కార్యక్రం జరుగుతుండగానే జేబులు ఖాళీ చేసే పనిలో దొంగలు తమపని తాము కానిచ్చారు.

వారు అక్కడికి చేరుకున్నాక స్థానిక నేతలు, కార్యకర్తలు వారికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో వారితో పాటు గుంపులో దూరిన దొంగలు మోత్కూరు జడ్పీటీసీ భర్త గోరుపల్లి సంతోష్ రెడ్డి జేబులోని డబ్బును దోచేశారు. కార్యక్రమం అయిపోయాకగానీ గుర్తించలేకపోయిన ఆయన.. రూ.40 వేలు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు శాలిగౌరారంలోనూ దొంగలు చేతివాటం ప్రదర్శించారు. రెండు చోట్లా రూ.లక్ష వరకు కాజేశారు. అయితే, వారి చేతివాటం కెమెరా కంటికి చిక్కింది. జేబు నుంచి డబ్బు కొట్టేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జేబుదొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.మంత్రుల పర్యటనలో జేబుదొంగల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంత్రుల పర్యటనలకు వెళ్ళితే జేబుదొంగల వ్యవహారం పోలీసులకు సైతం అంతుపట్టకుండా ఉంది. …

Leave a Reply

%d bloggers like this: