Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రియుడితో పెళ్లి చేస్తారా.. దూకేయమంటారా?: వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్‌చల్…

ప్రియుడితో పెళ్లి చేస్తారా.. దూకేయమంటారా?: వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్‌చల్
-పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘటన
-ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
-ప్రియుడిని ఒప్పించి ఇద్దరికీ పెళ్లి చేసిన పోలీసులు

ప్రేమించిన యువకుడు పెళ్ళికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు సిద్దపడింది. స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుంటే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి చేస్తానని ,వాటర్ ట్యాంక్ ఎక్కడంతో కుటుంబసభ్యులతో పాటు ఆ పేట చెందినవారు విషయాన్నీ పోలిసుల దృష్టికి తీసుకోని వెళ్లారు. పోలీసులు రంగ ప్రవేశంచేసి యువతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె నిరాకరించింది. దీంతో ప్రేమించిన యువకుడిని అక్కడకు పోలీసులు రప్పించారు. ఆయనతోనే తన పెళ్లి చేసుకొంటానని చెప్పించారు. దీంతో కథ సుఖంతమైంది. …

ప్రియుడితో తన పెళ్లి చేయకుంటే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకేస్తానంటూ యువతి హల్‌చల్ చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బెత్లహాంపేటకు చెందిన పెట్టెల కేశవాణి తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్‌ను ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. రెండు రోజుల క్రితం భాస్కర్ వద్ద యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిన్న స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది.

భాస్కర్‌తో తనకు వివాహం చేయకుంటే పైనుంచి దూకేస్తానని హెచ్చరిస్తూ కుటుంబ సభ్యులకు వాట్సాప్ వీడియో పంపింది. అది చూసి కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతితో ఫోన్‌లో మాట్లాడారు. భాస్కర్‌ను తీసుకొచ్చి వివాహానికి ఒప్పించారు. దీంతో కేశవాణి కిందికి దిగింది. అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి ఇద్దరికీ వివాహం జరిపించడంతో కథ సుఖాంతమైంది.

Related posts

అయ్యన్న అరెస్ట్.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు!

Drukpadam

బీఆర్​ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు…!

Drukpadam

పెనుకొండలోని టీడీపీ నాయకురాలి ఇంట్లో సీబీఐ సోదాలు!

Drukpadam

Leave a Comment