వైఎస్ వర్ధంతి నాడు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం..

వైఎస్ వర్ధంతి నాడు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం.. -రాజశేఖరరెడ్డితో పనిచేసిన నేతలకు విజయమ్మ ఆహ్వానం
-సెప్టెంబరు 2న వైఎస్సార్ వర్ధంతి
-పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం
-ఉండవల్లి, కేవీపీ, డి.శ్రీనివాస్ వంటి వారికి ఆహ్వానం

వచ్చే నెల 2న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన భార్య విజయమ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన పలువురు నేతలను ఆహ్వానించాలని విజయమ్మ నిర్ణయించినట్టు తెలిసింది. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. అప్పట్లో వైఎస్‌తో కలిసి పనిచేసిన నేతలు.. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి వంటి వారితోపాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన వారిని, రాజకీయ సహచరులు, శ్రేయోభిలాషులను కూడా విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అనేక పార్టీలలో ఉన్న వైయస్ సహచరులు , అభిమానిలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే జగన్ ,షర్మిల , ఈ కార్యక్రమానికి హాజరయ్యేది కానిది ఇంకా నిర్దారణ కాలేదు . రఘువీరా రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి ,లగడపాటి రాజగోపాల్ ,కే కేశవరావు , ధర్మాన ప్రసాద్ రావు , బొత్స సత్యనారాయణ ,అంబటి రాంబాబు ,తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. వైయస్ గురించి స్మరించుకునేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

Leave a Reply

%d bloggers like this: