ఢిల్లీలో గులాబీ కార్యాలయం … సెప్టెంబర్ 2 న భూమి పూజ చేయనున్న కేసీఆర్

ఢిల్లీలో గులాబీ కార్యాలయం … సెప్టెంబర్ 2 న భూమి పూజ చేయనున్న కేసీఆర్
-సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన …బిజీ బిజీ కార్యక్రమాలు
-మూడ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
-సెప్టెంబరు 1న ఢిల్లీ పయనం
-2న టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి భూమిపూజ
-సెప్టెంబరు 3న తిరిగి రాక

ఢిల్లీలో గులాబీ కార్యాలయం నిర్మాణానికి టీఆర్ యస్ పార్టీ సన్నద్ధమైంది. ఇందుకోసం టీఆర్ యస్ , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఇందులో భాగంగా సీఎం సెప్టెంబర్ 1 నుంచి 3 వ తేదీ వరకు ఢిల్లీ లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం నుంచి అధికారిక కారక్రమం విడుదలైంది. మూడు రోజుల పాటు వివిధ కారక్రమాలలో పాల్గొననున్నారు . అయితే బీజేపీ ,టీఆర్ యస్ మధ్య మతాల యుద్ధం కొనసాగుతున్న వేళ సీఎం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం ప్రధానిని కలిసే కార్యక్రమం లేనప్పటికీ ,అక్కడ ప్రధాని ఇచ్చే అపాయింట్ మెంట్ ను బట్టి ఉంటుందని సమాచారం .ఇప్పటివరకైతే ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1న బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం కానున్నారు. సెప్టెంబరు 2న దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ చేస్తారు.

హస్తినలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం కేంద్రం 1,300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సెప్టెంబరు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా పాల్గొంటారు. తిరిగి సెప్టెంబరు 3న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వస్తారు.

Leave a Reply

%d bloggers like this: