ప్యాంటుపై పెయింట్.. కస్టమ్స్‌లో కట్ చేస్తే మొత్తం బంగారమే!

ప్యాంటుపై పెయింట్.. కస్టమ్స్‌లో కట్ చేస్తే మొత్తం బంగారమే!
రెండు పొరల ప్యాంటుతో ప్రయాణికుడు
ప్యాంటుపై పసుపు రంగు పెయింట్
కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులో ఘటన
అధికారులకు చిక్కిన 302 గ్రాముల బంగారం పేస్ట్

కోటి కొండంగి ఉపాయాలు …కోటి కోసం కోటి విద్యలు , మోసం కోసం రకరకాల అవతారాలు … విన్నాం … దొంగ తనంగా బంగారాన్ని విదేశాలనుంచి తెచ్చిన ఒక వ్యక్తి చేసిన ప్రయోగాలు చూసి కస్టమ్స్ అధికారులకే నవ్వుతెప్పించింది. అతడి తన ప్యాంటు పై బంగారంతో పెయింట్ వేయించుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ పెయింట్ వల్లనే అతను దొరికిపోయాడు . అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆయన్ను చెక్ చేయగా పైన బంగారం పూత పూసినట్లు గుర్తించారు. అయితే బంగారం కేవలం 302 కావడం గమనార్హం .దీంతో ఆయన్ని కస్టడీలోకి తీసుకోని విచారిస్తున్నారు.

విమానాలు ల్యాండవగానే హడావుడిగా ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ప్యాంటుపై పసుపు రంగు మరకలు ఉండటం కస్టమ్స్ అధికారుల దృష్టిని ఆకర్షించింది. సదరు ప్యాసింజర్‌ను ఆపారు. పూర్తిగా చెక్ చేస్తే.. అతని ప్యాంటుపై మరకలు పెయింట్ కాదని, అది మొత్తం బంగారమని తేలింది. అంతేకాదు సదరు ప్యాంటు రెండు పొరలతో ఉంది. బంగారాన్ని పేస్టుగా మార్చి దాని లోపల పొరలపై పైనుంచి కింది వరకూ నింపేశాడా వ్యక్తి. దానిపై రెండో పొర కప్పి, ఏమీ ఎరగనట్లు ప్యాంటు ధరించాడు.

ఈ ఘటనలో 302 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ రూ.14 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఈ ప్యాంటును కత్తిరించిన అధికారులు.. ఆ ఫొటోలను నెట్టింట్లో విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆ దొంగ ఆలోచనకు షాక్ అవుతుంటే, మరికొందరేమో మెటల్ డిటెక్టర్స్ ఉండే చోట ఇలా ఎలా తీసుకెళ్లాడంటూ ఆ దొంగ తెలివితేటలు చూసి నవ్వుతున్నారు.

Leave a Reply

%d bloggers like this: