Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘన్ లో వేగంగా మారుతున్నాపరిణామాలు …ప్రంపంచం చూపు అటు వైపే!

ఆఫ్ఘన్ లో వేగంగా మారుతున్నాపరిణామాలు …ప్రంపంచం చూపు అటు వైపే!
-తాలిబన్​ ఎఫెక్ట్​: హైదరాబాద్​ లో బిర్యానీ ధరలను భారీగా పెంచేసిన రెస్టారెంట్లు
-బిర్యానీ ధర రూ.100కు పైగా పెంపు

హైదరాబాద్ బిర్యానీ అనగానే.. లొట్టలేసుకుంటూ ఆరగించేవాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి బిర్యానీ ప్రియులకు ఇది ఒకింత-మింగుడుపడని విషయమే. బిర్యానీ ధరలను రెస్టారెంట్లు భారీగా పెంచేశాయి. కారణం.. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం.. ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించేసుకోవడం.

బిర్యానీలో వాడే రకరకాల మసాల దినుసులు మనకు ఆఫ్ఘనిస్థాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. చాలా మంది కాబూలీలు ఇక్కడే ఉంటూ ఆ దినుసుల వ్యాపారం చేస్తుంటారు. అయితే, తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకోవడం వల్ల ఇప్పుడు భారత్ కు ఆ మసాల దినుసుల దిగుమతి ఆగిపోయింది. దీంతో అంజీర్, షాజీరా, బ్లాక్ ఆప్రికాట్, గ్రీన్ ఆప్రికాట్ తదితర మసాలల ధరలు భారీగా పెరిగిపోయాయి.

ఆ ప్రభావం బిర్యానీలపై పడింది. రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు బిర్యానీపై సగటున రూ.100కుపైనే పెంచేశారు. జులైలో ఓ ప్లేట్ బిర్యానీ ధర రూ.250 ఉండగా ఇప్పుడు రూ.350కి పెరిగింది. నెల క్రితం జంబో ప్యాక్ ధర రూ.600 ఉండగా.. ఇప్పుడు రూ.700 నుంచి రూ.800 దాకా అమ్ముతున్నారు. ఫ్యామిలీ ప్యాక్ ధర రూ.400 నుంచి రూ.550కి ఎగబాకింది. ఆన్ లైన్ లో ఆర్డర్స్ పెట్టుకునేవారికి జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలు అదనం. బిర్యానీ అంటే ఎంత ఇష్టమైనా.. దాని ధర ఒకేసారి రూ.100కుపైగా పెరగడమంటే మింగుడుపడని విషయమే కదా!!

ప్రపంచంలోని అత్యంత ఆధునికమైన ఆయుధాలవి. సైన్యాన్ని, ప్రజలను అయితే అమెరికా తీసుకెళ్లగలిగిందిగానీ.. వాటిని మాత్రం తీసుకెళ్లలేకపోయింది. మరి, అవన్నీ తాలిబన్ల చేతికి చిక్కితే ఏమైనా ఉందా? అన్ని చేసిన అమెరికా.. ఈ ఆలోచన చేయకుండా ఉంటుందా! అందుకే ఆఫ్ఘన్ గడ్డ మీద వదిలేసిన ఆయుధాలను పనికిరాకుండా చేసింది.

తాలిబన్లకు ఆయుధాలు దక్కినా నిరుపయోగంగానే ఉండాలని భావించిన అమెరికా.. వెళ్తూవెళ్తూ ముందు జాగ్రత్తగా ఆయుధాలు, వాహనాలను పనికిరాకుండా చేసేసింది. తాలిబన్లు కాబూల్ ఎయిర్ పోర్ట్ లోకి వచ్చేలోపు ఆ పనిని కానిచ్చేసింది. కాబూల్ ఎయిర్ పోర్టులో ఉన్న 73 విమానాల్లోని ఆయుధాలను తీసేశామని, పనిచేయకుండా చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కెన్నెత్ మెకింజీ చెప్పారు.

‘‘ఆ విమానాలేవీ ఎగరలేవు. ఎవరూ వాటిని తిరిగి ఉపయోగించలేరు’’ అని ఆయన చెప్పారు. 27 హమ్వీ వాహనాలనూ పాడు చేశామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్లను నాశనం చేసే సీ ర్యామ్స్ వ్యవస్థను చివరి నిమిషం వరకు వుంచుకున్న అమెరికా.. పోయేముందు దానినీ నాశనం చేసింది. ఇటు 70 ఎంఆర్ఏపీ వాహనాలనూ వదిలేశామని, అవీ తాలిబన్లకు ఏ విధంగానూ ఉపయోగపడవని చెప్పారు. ఈ ఒక్కొక్క ఎంఆర్ఏపీ వాహనాల విలువ 10 లక్షల డాలర్లన్నారు. మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ లో అడుగు పెట్టే అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకే వాటిని పేల్చేయకుండా వెళ్లిపోతున్నామన్నారు.

ఆఫ్ఘనిస్థాన్​ నుంచి అమెరికా తరలించిన చివరి వ్యక్తి ఇతనే!
మేజర్ జనరల్ క్రిస్ దొనాహువేనే చివరివ్యక్తి!

ఆఫ్ఘనిస్థాన్ లో 20 ఏళ్ల పాటు కొనసాగిన అమెరికా పట్టు.. ఇవాళ్టితో ముగిసిపోయింది. సైన్యం మొత్తాన్ని వెనక్కు తీసుకెళ్లిపోయింది. పెట్టుకున్న గడువులోపే ఉపసంహరణను పూర్తి చేసింది. మరి, ఆ ఉపసంహరణలో భాగంగా అగ్రరాజ్యం తరలించిన చిట్టచివరి వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకూ అమెరికా సమాధానం చెప్పేసింది.

తాము తరలించిన చిట్టచివరి అమెరికా వ్యక్తి 82వ ఎయిర్ బార్న్ డివిజన్ కమాండర్ జనరల్ క్రిస్ దొనాహువే అని వెల్లడించింది. నైట్ విజన్ గ్లాసెస్ తో క్లిక్ మనిపించిన ఫొటోను విదేశాంగ శాఖ పోస్ట్ చేసింది. సీ17 విమానంలో అతడిని కాబూల్ నుంచి అమెరికాకు తీసుకొచ్చేసినట్టు పేర్కొంది. కాగా, ఆగస్టు 14 నుంచి ఇప్పటిదాకా అమెరికా 1.22 లక్షల మందిని బయటికి తరలించినట్టు అంచనా.

మరి ఇంత చత్తగానా అంటూ అమెరికా చర్యలపై మండి పడుతున్న మాజీ అధ్యక్షుడు ట్రాంప్!

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇంత చెత్త ఉపసంహరణ చరిత్రలో ఎన్నడూ లేదని బైడెన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులను ఎదుర్కోలేక బైడెన్ సర్కార్ చేతులెత్తేసిందని విమర్శించారు. మొత్తం అత్యాధునికమైన ఆయుధాలను అక్కడ వదిలేసి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ప్రత్యేక విమానాల్లో ఆ ఆయుధాలను, వాహనాలను తీసుకొచ్చేయాలని డిమాండ్ చేశారు. 8,500 కోట్ల డాలర్ల సంపదలో ఒక్క డాలర్ ను కూడా వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. ఒకవేళ తాలిబన్లు వాటిని తిరిగివ్వకుంటే భారీ బలగాలతో అక్కడకు చేరుకుని తీసుకొచ్చేయాలన్నారు. అది చేతగాదంటే బాంబులు వేసైనా వాటిని నాశనం చేయాలన్నారు. అమెరికా ఇంత చెత్తగా వెనుదిరిగి వచ్చేస్తుందని ప్రపంచం ఊహించలేదన్నారు.

ఆఫ్ఘ‌నిస్థాన్ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త్‌తో స‌త్సంబంధాల కొన‌సాగింపుపై తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ తొలిసారి స్పందిస్తూ ప‌లు విష‌యాలు తెలిపారు.

భారత్ తో సత్సంబంధాల కు తాలిబన్ల యత్నం …

భార‌త్‌తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని చెప్పారు. అంతేగాక‌, భార‌త్ ఆఫ్ఘ‌న్‌కు ముఖ్యమైన దేశమని తెలిపారు. ఈ మేరకు తాలిబన్ సోషల్ మీడియా ఖాతాలో ఆయన వీడియో విడుద‌ల చేశారు.

ఆఫ్ఘ‌న్‌లో చాంబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసింద‌ని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ గుర్తు చేసుకున్నారు. కాగా, ప‌లు గ్రూపులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జ‌రిపిన అనంత‌రం ఆఫ్ఘ‌న్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు.

త‌మ ప్ర‌భుత్వంలో విభిన్న వర్గాల ప్రజల ప్రాతినిధ్యం ఉంటుంద‌ని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ పేర్కొన్నారు. షరియా ఆధారిత‌ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్ప‌ష్టం చేశారు. పాకిస్థాన్, చైనా, రష్యాల‌తో పాటు ప‌లు దేశాల‌తోనూ స‌త్సంబంధాలు కొన‌సాగించాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

 

Related posts

లోకేశ్ కు ప్రాణహానికి వైసీపీ కుట్రలు …గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు …!

Drukpadam

ప్రక్షాళన దిశగా టీఆర్ యస్ ….ఢిల్లీ బాట పట్టిన నేతలు!

Drukpadam

ఢిల్లీలో అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణరాజు కుమారుడు, కుమార్తె

Drukpadam

Leave a Comment