Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఇలాంటి ఈ-మెయిల్స్ వస్తున్నాయా..? తక్షణం జాగ్రత్త పడాల్సిందే!

ఇలాంటి ఈ-మెయిల్స్ వస్తున్నాయా..? తక్షణం జాగ్రత్త పడాల్సిందే!
-మీ ఖాతాలో ఖరీదైన వస్తువులకు చెల్లింపులు జరిగాయంటూ
-అమెజాన్, పేపాల్ పేర్లతో ఈ-మెయిల్స్
-ఫోన్ చేయగానే వ్యక్తిగత సమాచారం చోరీ
-అప్రమత్తంగా ఉండాలన్న క్యాస్పర్‌స్కై

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి వ్యక్తికీ జీమెయిల్ ఉంటోంది. ప్రతి చిన్న ఆన్‌లైన్ అవసరానికీ ఈమెయిల్ అవసరం అయిపోయింది. ఈ క్రమంలో ఈ జీ-మెయిల్స్‌ను ఆసరాగా చేసుకుంటున్న హ్యాకర్లు.. మన వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి కొత్త కొత్త పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక పద్ధతిని గుర్తించినట్లు క్యాస్పర్‌స్కై అనే సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు అమెజాన్, పేపాల్ వంటి ప్రముఖ కంపెనీల పేరిట మెయిల్స్ పంపుతున్నట్లు ఈ కంపెనీ గుర్తించింది. యూజర్ల ఖాతాల నుంచి ఖరీదైన వస్తువులకు చెల్లింపులు జరిగినట్లు ఈ మెయిల్స్ వస్తాయట. తమ అమెజాన్ ఖాతాలో యాపిల్ వాచ్ లేదా గేమింగ్ ల్యాప్‌టాప్ వంటి ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేశారని, వీటికి పేపాల్ నుంచి చెల్లింపులు జరిగాయని ఈ మెయిల్ చెబుతుంది.

ఒకవేళ ఈ చెల్లింపులు సదరు వ్యక్తి చేయకుంటే వెంటనే కింద ఇచ్చిన మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలనేది సదరు మెయిల్ సారాంశం. ఇలాంటివి చదివిన యూజర్లు కంగారుపడిపోయి వెంటనే ఆ నంబరుకు ఫోన్ చేస్తారు. దీనికి బదులిచ్చే హ్యాకర్లు అమెజాన్ లేదంటే పేపాల్ ప్రతినిధిలా మాట్లాడతారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా చోరీ చేస్తున్నారు. ఒక్కోసారి ఫోన్ మాట్లాడే సమయంలో యూజర్‌ను ఏమార్చి వారి కంప్యూటర్లలో వైరస్‌ ఇన్‌స్టాల్ చేసుకునేలా సూచనలిస్తున్నారు. ఇలా చేసి కంప్యూటర్లలోని డేటా మొత్తాన్ని కాజేస్తున్నారట. ఈ వివరాలన్నీ వెల్లడించిన క్యాస్పర్‌స్కై సంస్థ.. ఇటువంటి మెయిల్స్ వస్తే వెంటనే ఓపెన్ చేయకుండా ఇలాంటి లావాదేవీలు తమ ఖాతా నుంచి జరిగాయా? లేదా? అని నిర్ధారించుకోవాలని సూచించింది. అనుమానం వస్తే ఈ మెయిల్స్‌ను డిలీట్ చేసేయాలని టెక్ ఎక్స్‌పర్ట్‌ల సలహా.

Related posts

కొడుకుకు స్లిప్పులు ఇచ్చేందుకు వెళ్లి తన్నులు తిన్న తండ్రి.. !

Drukpadam

12 రోజుల క్రితం అదృశ్యమై విగతజీవిగా కనిపించిన హర్యాన్వీ గాయని!

Drukpadam

టీ పొడి అనుకుని పిచికారీ మందుతో టీ తయారు చేసిన ఇల్లాలు.. ఐదుగురి మృతి!

Drukpadam

Leave a Comment