తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం …. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు!

తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం …. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు
ఇది నిజామా అని అటు అధికార పక్షం , ఇటు ప్రతిపక్షం ఆరా !
పాలేరు లో అనూహ్య ఓటమి అనంతరం తుమ్మల వర్గీయులలో అసంతృపి
కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యే కందాల ,తుమ్మల వర్గీయుల మధ్య ఘర్షణలు
వేరు వేరు గా తుమ్మల , కందాల వర్గాల సమావేశాలు
ఎత్తులకు పై ఎత్తులు

ఖమ్మంజిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చెరుతున్నట్లు సోషల్ మీడియా లో వచ్చిన ఒక వార్త రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ వార్తలో నిజమెంత అనే విషయాన్ని అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఆరా తీసింది . నాలుగు దశాబ్దాలకు పైగా జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించి , చక్రం తిప్పిన తుమ్మల గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు. పాలేరు నియోజకవర్గంలో తన మూడు సంవత్సరాల పదవీకాలంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశారు. కానీ తన నోటి దురుసుతనం తో ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటు పార్టీలోని వెన్నుపోట్ల వలెనే ఓడిపోయిరనే అభిప్రాయాలూ ఉన్నాయి. జిల్లా అభివ్రిద్ది ప్రదాతగా ఉన్న తుమ్మల ఓటమితో కేసీఆర్ మరో సారి తుమ్మలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. అయితే తనకు కేసీఆర్ ఎమ్మెల్సీ రూపంలో అవకాశం కల్పించి మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. అయితే అదే సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్ ఖమ్మం నుంచి టీఆర్ యస్ పార్టీ తరుపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక నాయకుడుగా నిలిచారు. దీంతో అజయ్ కు మంత్రి వర్గంలో స్థానం కల్పించడం తుమ్మల కు అవకాశాలు చేజారాయి. అజయ్ కు మంత్రి పదవి రావడంతో జిల్లాలో తుమ్మల అనుయాయిలకు ఇబ్బంది కరంగా మారింది. శాసనసభ ఎన్నికలకు ముందు వరకు హవా కొనసాగించిన తుమ్మల అనుయాయులకు తుమ్మల ఓటమి శరాఘాతంగా మారింది.

ఇక పాలేరు నుంచి కాగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ యస్ లో చేరడంతో నియోజకవర్గంలో ఉన్న టీఆర్ యస్ పార్టీలో తుమ్మల అనుయాయిలు , తుమ్మల వ్యతిరేకులుగా చీలిపోయారు. నియోజకవర్గంలో తుమ్మల హవాకు బ్రేక్ పడింది. ఎమ్మెల్యే గా ఉన్న కందాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో తుమ్మల వర్గంలో అసంతృప్తి నెలకొన్నది ఇది పలుమార్లు తుమ్మల అనుయాయిలకు ఆయా గ్రామాలలో ఘర్షణలు జరిగాయి. చివరకు ఒకే పార్టీలో ఉన్న వారిమధ్య గొడవలు ,కేసులు , జైళ్లకు వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తుమ్మల అనువాయీయులను టార్గెట్ చేయడంతో నియోజకవర్గంలో తుమ్మల, కందాల వర్గాల మధ్య ఆధిపత్య పోరు కు దారితీసింది. వేరు పర్యటనలు , వేరు వేరు సమావేశాలు పెడుతున్నారు. ప్రధానంగా తుమ్మల తనయుడు యుగంధర్ గ్రామాలలో పర్యటిస్తూ రానున్న రోజులు మనవే… ఏ సమస్య వచ్చిన నాదగ్గరకు తీసుకోని రండంటూ కార్యాకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఇటీవల తెల్దారుపల్లిలో జరిగిన తుమ్మల మద్దతు దార్ల సమావేశంలో యుగంధర్ ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహపరిచింది.

తుమ్మల వ్యతిరేకంగా సోసిల్ మీడియా లో పోస్టింగులు రావడం పై ఆగ్రంగా ఉన్నారు. అప్పుడే ఆయన స్వయంగా కమిషనర్ అఫ్ పోలీస్ ను కలిసి ఫిర్యాదు చేశారు . ఏనాడూ జిల్లా ఎస్పీ కార్యాలయం లో ఫిర్యాదు చేయని తుమ్మల మొదటి సరిగా తనపై వచ్చిన పోస్టింగులపై ఫిర్యాదు చేయడం ఆశక్తిగా మారింది. తరువాత కాలంలో కూడా ఆయన రాజకీయాలలో కొంత సైలంట్ గా ఉండే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితులు ఆయన్ను బలవంతంగా ఆక్టివ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయిస్తున్నాయి, అందువల్లనే ఆయన రాజకీయ కదలికలపై నిరంతరం నిఘా ఉంది. ఆయన ఏమి చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారు .ఎవరిని కలుస్తున్నారు.లాంటి విషయాలపై ఇటు రాజకీయవర్గాలు , అటు పరిశీలకులు నిశిత పరిశీలిన చేస్తున్నారు. అందువల్ల ఆయన నలుగురితో కలిస్తే చాలు ఎదో చేస్తున్నారనే అభిప్రాయాలతో వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ చేరుతున్నట్లు ఒక వార్త హల్చల్ చేసింది. తుమ్మల లాంటి రాజకీయ దురంధరుడు అంత తేలిగ్గా పార్టీ మారె పరిస్థితులు ఉండక పోవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి. ఒక వేళ తప్పని సరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చినా, అది పార్టీ పొరపాటు గానే ఉంటుంది తప్ప తన తప్పుగా లేదా పొరపాటుగా ముద్ర వేయించుకోరనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. తుమ్మల విషయంలో ఏమి జరుగుతుందో చూద్దాం …..ఏమైనా పాలిట్రిక్స్ … వెయిట్ అండ్ సీ…..

Leave a Reply

%d bloggers like this: