నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 191 ఆలౌట్

నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 191 ఆలౌట్
-భారత్ హీరోలు జీరో లు అయ్యారు … కష్టాలతో ప్రారంభమైన నాలుగవ టెస్ట్
-కోహ్లీ ,శార్దూల ఆదుకున్నారు .
– మిగతా వాళ్ళంతా వరసగా పెవిలియన్ కు క్యూకట్టారు … 122 పరుగులకే 6 వికెట్లు డౌన్
-5 గురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్స్ కలిసి చేసిన స్కోర్ కేవలం 56 పరుగులే
-లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలగవ టెస్ట్
-టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
-మరోసారి విఫలమైన టీమిండియా టాపార్డర్

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా టాపార్డర్ మరోసారి తడబడింది. లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న శార్దూల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఠాకూర్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ప్రధాన బ్యాట్స్ మెన్ విఫలమైన చోట ఠాకూర్ ఇంగ్లండ్ బౌలర్లను దూకుడుగా ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4, ఓల్లీ రాబిన్సన్ 3 వికెట్లు తీశారు.

అంతకుముందు కెప్టెన్ కోహ్లీ (50) పరుగులు సాధించాడు. కాగా, ఈ ఇన్నింగ్స్ తో కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా అవతరించాడు. సచిన్ కు ఈ ఘనత నమోదు చేసే క్రమంలో 522 ఇన్నింగ్స్ లు ఆడగా, కోహ్లీ 490 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు నెలకొల్పాడు.

మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది .ఒకటి మనం గెలవగా మరొకటి ఇంగ్లాండ్ గెలిచింది.దీంతో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. సీరీస్ గెలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలగవ టెస్టులో భారత్ ఆటగాళ్లు వరసగా పెవిలిన్ కు క్యూకట్టారు. అరవీర భయంకరులు సెంచరీ వీరులు అంటూ వారిని కామెంటేటర్లు భట్రాజు పొగడ్తలు పొగుడుతుండగానే వికెట్లను ప్రత్యుర్హులకు సమర్పించుకొని పెవిలియంకు చేరుకున్నారు . ఒక రకంగా చెప్పాలంటే భారత్ ఆటగాళ్ల చెత్త ఆట తో అభిమానులను సైతం చిరాకు తెప్పించింది. మన 5 గురు హీరో లు చేసిన స్కోర్ కేవలం 56 పరుగులే కావడం గమనార్హం . అయితే క్రికెట్ లో ఇప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమని మంచి బ్యాట్స్ మెన్స్ సైతం విఫలమైన సందర్భాలను ఉదాహరిస్తుంటారు .

రోహిత్ శర్మ (11), కేఎల్ రాహుల్ (17), పుజారా (4), జడేజా (10), రహానే (14) విఫలమయ్యారు.

Leave a Reply

%d bloggers like this: