Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్!

టీడీపీ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్
-చంద్రబాబును కలిసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
-పార్టీ పరిస్థితులపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేత
-విషయం కనుగొనేందుకు త్రిసభ్య కమిటీ వేసిన పార్టీ అధిష్ఠానం
-చంద్రబాబును కలవడంపై సర్వత్ర ఆసక్తి

టీడీపీలో ఇటీవల చంద్రబాబు పై తీవ్రమైన ఆరోపణలు చేసి వార్తలలోకి వెక్కిన సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పు లో తుఫాన్ లాగా అయింది. గురువారం ఆయన పార్టీ అధినేత చంద్రబాబు ను కలిశారు. అంతకుముందు బుచ్చయ్య వ్యవహారంలో త్రీ సభ్య కమిటీ ని ఏర్పాటు చేసిన చంద్రబాబు బుచ్చయ్య ను కలిసి ఆయన అసంతృప్తికి కారణాలపై ఆయన తో చర్చించారు. వారు ఆయనతో భేటీ అయి విషయాలను చర్చించారు. వారి సూచనా మేరకు బుచ్చయ్య చౌదరి చందరబాబును కలిశారు. చంద్రబాబు తో భేటీ సందర్భంగా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం .దీంతో మెత్తబడ్డ బుచ్చయ్య చౌదరి తన రాజీనామాను యోచనను విరమించుకున్నారు.

ఇటీవల తెలుగు దేశం పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తికి కారణం కనుక్కోవడం కోసం ఇటీవల పార్టీ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబును కలిశారు.

ఆయన వెంట టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, జవహర్ తదితరులు ఉన్నారు. పార్టీపై బుచ్చయ్య చౌదరి అలకబూనడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్ఠానం.. విషయం తెలుసుకోవడం కోసం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కె.ఎస్. జవహర్‌లతో కమిటీ వేసింది.

వీరంతా బుచ్చయ్య నివాసానికి వెళ్లి ఆయనతో రెండున్నర గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసేందుకు బుచ్చయ్య మంగళగిరి వచ్చారు. ఈ సమావేశం తర్వాత సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Related posts

నన్ను, నా భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారు..ఎమ్మెల్యే పొన్నాడ!

Drukpadam

లక్షద్వీప్ లో ప్రఫుల్లా ఖోడా పటేల్ ను తొలగించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం…

Drukpadam

ఏపీ లో వలంటీర్ల వ్యవస్థపై కౌంటర్ ఎన్ కౌంటర్… పవన్ వర్సెస్ జగన్

Drukpadam

Leave a Comment