జైల్లో తీన్మార్ మల్లన్న నిరాహార దీక్ష చేయడం లేదు: జైలు సూపరింటెండెంట్!

జైల్లో తీన్మార్ మల్లన్న నిరాహార దీక్ష చేయడం లేదు: జైలు సూపరింటెండెంట్
-ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న మల్లన్న
-పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా నిరాహారదీక్షకు దిగినట్టు ప్రచారం
-స్పందించిన చంచల్ గూడ జైలు సూరింటెండెంట్ డి.శ్రీనివాస్

క్యూ న్యూస్ అధినేత ప్రజా ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న ఇటీవల ఒక కేసు విషయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు . మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడా జైలుకు తరలించారు. అయితే ఇది తప్పుడు కేసు అనే తనపై కావాలనే కేసీఆర్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని అందులో భాగంగానే అరెస్ట్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. … ఇంతవరకు బాగానే ఉన్న తీన్మార్ మల్లన్న చంచల్గూడ జైలు లో తనపై పెట్టిన తప్పుడు కేసులకు నిరసనగా నిరాహారదీక్ష చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై జైలు సూపరెంటెండెంట్ డి .శ్రీనివాస్ వివరణ ఇచ్చారు . మల్లన్న ఎలాంటి దీక్షలను జైలు లో చేపట్టలేదని కొన్ని మాధ్యమాల్లో ఆయన దీక్షలు చేస్తున్నట్లు రావడం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యామని పేర్కొన్నారు. ఇది ఎంతమంత్రం నిజం కాదని ఆయన ఎలాంటి దీక్ష చేయడం లేదని వివరం ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న సత్తా చాటారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన కీలక పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఆ ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇదిలావుంచితే, ఒక వ్యక్తిని బెదిరించిన ఆరోపణల కేసులో ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం నుంచి ఆయన జైల్లో నిరాహారదీక్ష చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆయన నిరాహారదీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంచల్ గూడ జైలు సూరింటెండెంట్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తీన్నార్ మల్లన్న ఎలాంటి దీక్ష చేయడం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

%d bloggers like this: