Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్? ముహూర్తమే మిగిలింది…

కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్? ముహూర్తమే మిగిలింది…
-సోనియా గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
-ఆయన చేరికపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు
-కొందరు సీనియర్లు ససేమీరా అంటున్నారు
-మరికొందరు స్వాగతిస్తున్నారు

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇక లాంఛనమే అన్నట్లు సమాచారం . ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలోకి తీసుకునే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందని తెలుస్తుంది. సోనియా గాంధీ నిర్ణయం కోసమా ఎదురుచూస్తున్నారు .

ప్రశాంత్ కిషోర్ చేరికపై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ప్రశాంత్ కిషోర్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వ్యూహకర్తగా కొనసాగుతుండగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ ఆయనతో విబేధించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు . తరువాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు సాగించారు.

ప్రశాంత్ కిషోర్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఈ ఏడాది జులై నెలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. వీరంతా ప్రశాంత్ కిషోర్ రాకను స్వాగతించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. అయితే, కొందరు నేతలు మాత్రం ప్రశాంత్ కిశోర్ రాకను వ్యతిరిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేశారు. మొదట ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆయన కలిసిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా?

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా మూడో ఫ్రంట్ సాధ్యం కాదని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్ష పార్టీలో పోరాడాలని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మరికొందరు సీనియర్ నేతలు ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే మరింత కలిసివస్తుందని అంటున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ పార్టీలోకి వస్తే రాజకీయం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుందని మరికొందరు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చేసే ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీకి సరిపోవని సీనియర్ నేతలంటున్నారు. ఆయన దగ్గర ఎలాంటి మంత్ర దండమూ లేదని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కల్చర్, అప్రోచ్‌ను అనుసరించడం కొంత కష్టమైన పనేనని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ అహ్మద్ పటేల్ పాత్ర పోషిస్తారా?

అయితే, కీలక నేత అహ్మద్ పటేల్ చనిపోయిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మంచి సలహదారు ఎంపిక కోసం సోనియా గాంధీ వేచిచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన సూచనలను ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. అయితే, గతంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమాల పద్ధతి బాగుండదని ఆయన వ్యాఖ్యానించారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ.. అకాలీదళ్-బీజేపీ కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చింది.

తన వైఖరే కాంగ్రెస్ పార్టీకి సమస్య

ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని, దాని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు చెబితే ఆ పార్టీ నడుచుకోదని, కాంగ్రెస్ పార్టీ తన సొంత వైఖరిని కలిగివుందని చెప్పారు. తన పద్ధతిలో పని చేయడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తన వైఖరే సమస్యగా మారిందని, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు.

 

 

Related posts

శశి థరూర్ పై భగ్గుమన్న కాంగ్రెస్..

Drukpadam

రాహుల్ అనర్హతపై స్పందించిన జర్మనీ.. విదేశీ జోక్యాన్ని సహించబోమన్న భారత్…

Drukpadam

పంజాబ్ సీఎంకు సిద్ధూ సారీ చెప్పాల్సిందే: అమరిందర్ సహచరుల డిమాండ్!

Drukpadam

Leave a Comment