బిగ్ బాస్ నిర్వాకులు హౌస్ మేట్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోండి :పూనమ్ కౌర్!

బిగ్ బాస్ నిర్వాకులు హౌస్ మేట్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోండి :పూనమ్ కౌర్
-దళితుల గుండు కొట్టించినవాణ్ణి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు 
-అతను సమాజానికి ప్రమాదకారి
-బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడుపై పరోక్ష వ్యాఖ్యలు
-రాజకీయ నేరగాడంటూ తీవ్ర వ్యాఖ్యలు
-బిగ్ బాస్ యాజమాన్యానికీ విజ్ఞప్తి చేసిన సినీ నటి
-కంటెస్టెంట్లను ఎంపిక చేసే ముందు బ్యాగ్రౌండ్ చెక్ చేయాలని కామెంట్
-ఇప్పటికే తీరని నష్టం జరిగిందని ఆవేదన

బిగ్ బాస్ నిర్వాణంపై , కంటెస్టెంట్ల విషయంలో అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. సూచనలు ఉన్నాయి. తాజాగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో ఎంపిక తీరుపై పూనమ్ కౌర్ స్పందించారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్, సినీ నిర్మాత నూతన్ నాయుడును ఉద్దేశించి సినీ నటి పూనమ్ కౌర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతడిపై మండిపడ్డారు. దళితులకు గుండు కొట్టించాడని, ఐఏఎస్ అధికారుల ఫోన్లను హ్యాక్ చేశాడని మండిపడ్డారు. వాట్సాప్ లో అసత్యపు కథనాలు, సందేశాలను ఫార్వర్డ్ చేశాడని అన్నారు. అతడో రాజకీయ నేరగాడు కూడా అయి ఉండొచ్చన్నారు.

సమాజానికి చాలా ప్రమాదకారి అని, ఎన్నెన్నో నేరాలు చేశాడని అన్నారు. అతడు సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తున్న సందేశాలను చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. అందుకే అతడి వ్యవహారాలను బయటపెడుతున్నానని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాకుండా అతడిపై గత ఏడాది సెప్టెంబర్ లో తాను చేసిన ఫిర్యాదు కాపీని కూడా ఆమె పోస్ట్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు యాజమాన్యానికి, తెలుగు చానెళ్లన్నింటికీ ఆమె ఓ విజ్ఞప్తి చేశారు. ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసుకునే పోటీదార్ల వివరాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరారు. వారి బ్యాగ్రౌండ్ మొత్తం చెక్ చేశాకే షోలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎంటర్ టైన్మెంట్ అనేది నేరాలకు దారి తీసేలా ఉండకూడదన్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందని, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని పూనమ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

%d bloggers like this: