Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోపంతో రిబ్బ‌న్‌ను ప‌ళ్ల‌తో కొరికి క‌ట్ చేసి పారేసిన మంత్రి.. 

కోపంతో రిబ్బ‌న్‌ను ప‌ళ్ల‌తో కొరికి క‌ట్ చేసి పారేసిన మంత్రి.. 
-పాకిస్థాన్‌లో ఘ‌ట‌న‌
-క‌త్తెర‌కు ప‌దును లేద‌ని కోపం
-పాక్ మంత్రిపై నెటిజ‌న్ల సెటైర్లు

మంత్రులు ఇతర వి ఐ పి లు అనేక సందర్బాలలో శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలకు వెళుతుంటారు. అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి సందర్భాలలో వచ్చిన గెస్ట్ తో గొబ్బరికాయలు కొట్టించడం , లేదా రిబ్బన్ కత్తిరింపులు చేయడం సాధారణంగా జరుగుతుంటాయి, అలంటి సందర్భాలలో నిర్వాకులు కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నపటికి తోపాటు జరుగుతుంటాయి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.ఆ సందర్భంగా ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్టారు కానీ కట్టారు దాన్ని కట్ చేసేందుకు ఉపయోగించాల్సిన కత్తెర మరిచారు. ఈ లోపు దాన్ని తెచ్చేందుకు కొంత ఆలశ్యం అయింది. దీంతో చిర్రెత్తిన సీఎం కేసీఆర్ దాన్ని బలంగా లాగి లోనకు వెళ్లారు. ఇదే సంఘటన పాకిస్తాన్ లో ఒక మంత్రి షాప్ ప్రారంభానికి వెళ్లారు .అట్టహాసంగా మంత్రిగారు కోసం వేర్పాట్లు చేశారు. షాప్ ఓపెన్ చేసేందుకు రిబ్బన్ కట్టారు. కత్తెర కూడా ఏర్పాటు చేశారు. తీరా దాన్ని ఉపయోగించి ఆ మంత్రిగారు రిబ్బన్ కట్ చేసేందుకు ప్రయత్నం చేస్తే అది కట్ కావడం లేదు .దాన్ని బలవంతగా తంబళ్లతో తెంపి లోనకు వెళ్లారు. దీంతో అక్కడకు వచ్చిన వారంతా నవ్వుకున్నారు …. వివరాల్లోకి వెళ్ళితే ….

ఓ దుకాణాన్ని ప్రారంభించ‌డానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బ‌న్‌ను క‌త్తెర‌తో కాకుండా పళ్ల‌తో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లాహోర్‌లో కొత్త‌గా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ వెళ్లారు.

దుకాణ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద క‌ట్టిన‌ రిబ్బన్ ను ఆయ‌న క‌ట్ చేసి లోప‌లికి వెళ్లాల్సి ఉంది. దాని కోసం నిర్వాహ‌కులు క‌త్తెర కూడా తీసుకొచ్చారు. అయితే, ఆ క‌త్తెర‌ పదునుగా లేదు. ఎంత‌గా ట్రై చేసినా అది క‌ట్ కాలేదు. దీంతో ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. షాపు యజమానిని తిట్టుకుంటూ ప‌ళ్ల‌తోనే రిబ్బ‌న్ ను పరపరా క‌ట్ చేసిపారేశారు. అది చూసి, అక్క‌డున్న వారు మాత్రం న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. మరోపక్క, ఆయ‌న తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

Related posts

లిక్కర్ స్కాంలో ఐదు టీవీ చానళ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

Drukpadam

హెలికాప్ట‌ర్ బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. ప్ర‌మాదానికి కార‌ణాలు వెల్ల‌డ‌య్యే ఛాన్స్‌!

Drukpadam

Drukpadam

Leave a Comment