కేసీఆర్ తోనే తన ప్రయాణం : మాజీ మంత్రి తుమ్మల…

కేసీఆర్ తోనే తన ప్రయాణం : మాజీ మంత్రి తుమ్మల…

-టీఆర్​ఎస్​ ను వీడుతున్నారన్న వార్తలపై స్పందించిన తుమ్మల
-పార్టీ మారడం లేదని స్పష్టీకరణ
-తాను టీఆర్ యస్ ని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
-నీతికి కట్టుబడి ఉన్నానని కామెంట్

తాను టీఆర్ యస్ ని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు … పార్టీ మారాల్సిన అవసరం గాని అగత్యం గాని తనకు లేదని కుండబద్దలు కొట్టారు. పార్టీని వీడుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, వాటిపై ఆయన తాజాగా స్పందించారు. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి . దీని వెనక ఎవరు ఉన్నారు . తాను పార్టీ మారాలని కోరుకునే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఏ పదవి లేని నాడు నన్ను పిలిచి సీఎం కేసీఆర్ మంత్రు పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు.జిల్లా అభివృద్ధికి పనిచేసే సువర్ణ అవకాశం కల్పించారు. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన కేసీఆర్ ను వీడే ప్రసక్తే ఉత్పన్నం కాదు … రాజకీయాల్లో విలవలకోసమే నిలబడ్డ చరిత్ర నాది..చిల్లర రాజకీయాలు చేయను … ఖమ్మం జిల్లా ప్రజలకు తుమ్మల అంటే ఏమిటో తెలుసు 40 సంత్సరాల రాజకీయజీతంలో మచ్చ లేకుండా ప్రజలకు సేవ సేవ చేసే అదృష్టం దక్కింది. జిల్లా అభివృద్ధిలో తన పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నాను అని అన్నారు.

తాను పార్టీ మారడం లేదని, ఆ ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ తోనే తన రాజకీయ ప్రయాణమని తెలిపారు. రాజకీయాల్లో తాను నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని, సీఎం కేసీఆర్ భారీగా నిధులను ఖర్చు చేశారని ఆయన చెప్పారు.

సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మారుతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. పుకార్లు వచ్చిన మరుసటి రోజునే ఆయన ఢిల్లీలో కేసీఆర్ తో కలిసి దర్శమిచ్చారు.ఖమ్మం ఎంపీ టీఆర్ యస్ లోకసభాపక్ష నేత నామ నాగేశ్వరరావు ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చిన విందు సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ విందు సమావేశంలో సీఎం కేసీఆర్ తుమ్మలను ఆప్యాయంగా పలకరించారు. పాత విషయాలను ఒకసారి గుర్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం . ఇద్దరిమధ్య సరదా సంభాషణ జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే తనపై వస్తున్న వార్తలకు ఆయన కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది . ఢిల్లీ లో టీఆర్ యస్ భవన్ శంకుస్థాపనకు మంత్రులు ,ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు , ఎంపీ లు మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో హాజరైయ్యారు. పార్టీ మార్పు లేదనేది తుమ్మల తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: