Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లేన్లుగా విస్తరించాలి గడ్కరీని కోరిన కేసీఆర్!

విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లేన్లుగా విస్తరించాలి గడ్కరీని కోరిన కేసీఆర్!
ఢిల్లీ లో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం కేసీఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి
5 అంశాలపై లేఖల అందజేత
రాష్ట్రంలో 1,138 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి వినతి
కేంద్ర జలశక్తి మంత్రితో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం
షెకావత్ తో నీటి అంశాలపై చర్చ
ఏపీతో వివాదాలపై వివరణ

గత ఐదురోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని ,హోమ్ మంత్రి తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరస భేటీలతో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి సంబందించిన అనేక అంశాలపై వారితో చర్చిండంతోపాటు , సవివరమైన వివరాలతో కూడిన లేఖలను సైతం అందజేస్తున్నారు. విభజన చట్ట హామీలతో పాటు రహదార్లు ,నది జలాలు పంపిణీపై వివాదాలు , గురించి మంత్రులతో భేటీ అవుతుండటంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది . ఆయన వెంట వివిధ శాఖల మంత్రులు , లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామ నాగేశ్వర రావు పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఆయన ఈరోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన 5 అంశాలపై లేఖలు అందించారు. విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లేన్లుగా విస్తరించాలని కోరారు.

అదే విధంగా కల్వకుర్తి-హైదరాబాద్ రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీశైలం రహదారిని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,138 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. రీజినల్ రింగ్‌రోడ్ నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రిని కేసీఆర్ అడిగారు. వీటన్నింటిపైనా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ నీటి వాటా పెంచాల్సిందే …కేంద్ర జలశక్తి మంత్రితో కేసీఆర్

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఏపీతో జల వివాదాలపై చర్చించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై తెలంగాణ అభ్యంతరాలను షెకావత్ కు వివరించారు. కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై తమ వాదనలను వినిపించారు.

కాగా, గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ కేంద్రం పెద్దలను కలుస్తూ పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిశారు. అంతకుముందు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్నారు.

 

Related posts

ఏపీ సర్కారు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించిన కేంద్రం

Drukpadam

చీమలపాడు ఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

Drukpadam

రష్యా వార్నింగ్ ను లెక్కచేయకుండా ప్రాణత్యాగం చేసిన ఉక్రెయిన్ సైనికులు

Drukpadam

Leave a Comment