Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కెనడా ప్రధానిపై రాళ్ల దాడి!

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కెనడా ప్రధానిపై రాళ్ల దాడి!
కెనడాలో నెల 20 ఎన్నికలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జస్టిన్ ట్రూడో
ప్రచార బస్సుపై గులకరాళ్ల వర్షం
పాత్రికేయులకు తగిలిన రాళ్లు
కెనడా ఎన్నికల్లో భారతీయుల ప్రభావం
ట్రూడో అనుకూల వ్యతిరేకులుగా చీలిపోయిన భారతీయులు

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనపై ప్రజలు రాళ్ల వర్షం కురిపించారు. సెప్టెంబరు 20న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాంట్ ఫోర్డ్, ఒంటారియో ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ఒంటారియోలోని లండన్ టౌన్ లో ప్రచారం చేస్తుండగా, ఆగ్రహించిన ప్రజలు ఆయన ప్రయాణిస్తున్న ప్రచార బస్సుపై గులక రాళ్లతో దాడి చేశారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రధాని ప్రచారానికి కవరేజీ ఇస్తున్న పాత్రికేయులకు మాత్రం రాళ్లు తగిలాయి. అయితే ఈ ఘటనను ప్రధాని జస్టిన్ ట్రూడో తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు రాళ్లు వేశారు… గతంలో ఓసారి నాపై గుమ్మడికాయ విత్తనాలు కూడా విసిరారు అంటూ పాత్రికేయులకు వివరించారు.

ఇంతకీ ప్రజలు ప్రధానిపై ఆగ్రహం చెందడానికి కారణం కరోనా నిబంధనలే. వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేయడంతో పాటు, కరోనా నియమావళిని కచ్చితంగా పాటించాల్సిందేనని ట్రూడో సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దేశీయంగా విమానాల్లో, రైళ్లలో ప్రయాణాలకు కూడా వ్యాక్సినేషన్ నిబంధన అమలు చేస్తుండడం కెనడా ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాని ప్రచారానికి ప్రజలు పలుచోట్ల ఆటంకాలు సృష్టిస్తున్నారు.

జస్టిన్ ట్రూడో వరసగా రెండవసారి అధికారం చేపట్టారు . మూడవ టర్మ్ కోసం ఆయన లిబరల్ పార్టీ తరుపున ప్రచారం లో పాల్గొంటున్నారు. సుమారు నాలుగు కోట్ల జనాభా ఉన్న కెనడా దేశంలో ట్రూడో కు ముందు కన్సర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది.

ట్రూడో పై రాళ్లదాడి కి ప్రధానంగా కరోనా నిబంధనలతో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులు గా భావిస్తున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అమాంతం పెరిగింది. రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి . వాటి రేట్లు తగ్గాలంటే ట్రూడో పాలన అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అనేక దేశాల జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. భారతీయులు ట్రూడో అనుకూల వ్యతిరేకులుగా చీలిపోయారు. ప్రధానంగా సిక్కులు ఎన్డీపీ ని సఫోర్ట్ చేస్తుండగా రెండవసారి అధికారంలోకి వచ్చిన ట్రూడో ప్రభుత్వం మైనార్టీ గా ఉండటంతో ఎన్డీపీ బలపరిచింది. ఈసారి మెజార్టీ భారతీయులు ట్రూడో కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం .గతంలో ట్రూడో రావాలని కోరుకున్న అనేకమంది ఈసారి కాన్సెర్వేటివ్ రావాలని కోరుకోవడం విశేషం . ఇప్పటికే ఈ మేరకు ప్రచారం కూడా ప్రారంభించారు. ట్రూడో భారత్ లో మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారు. ఇందుకు సిక్కుల ప్రభావమే కారణంగా ఉంది. సిక్కుల జనాభా రీత్యా మంచి సంఖ్యలోనే ఉండి, కెనడా రాజకీయాలలో ప్రభావం చూపుతున్నారు. అందువల్ల కెనడా ని ఎవరు పాలించాలి అనే దానిలో భారతీయుల ప్రభావం కూడా ఉండబోతుండటం గమనార్హం .

Related posts

సీఐడీ నోటీసుల‌పై స్పందించిన ర‌ఘురామకృష్ణ‌రాజు

Drukpadam

సీఎం ఆదిత్యనాథ్ “అబ్బా జాన్” వ్యాఖ్యలపై మండిపడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా…

Drukpadam

టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ , నిప్పులు చెరిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి…

Drukpadam

Leave a Comment