Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై రాజద్రోహం కేసు…

యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై రాజద్రోహం కేసు…
-యోగి సర్కారుపై వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం.
-యోగి ప్రభుత్వాన్ని రక్తం తాగే పిశాచిగా అభివర్ణించిన ఖురేషి
-మాజీ ఎమ్మెల్యే ఆజాం ఖాన్‌ను కలిసిన సందర్భంగా వ్యాఖ్యలు
-రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ఉన్నాయని ఫిర్యాదు

ఇటీవలనే సుప్రీం కోర్ట్ రాజద్రోహం కేసుపై వ్యాఖ్యానించిన నేపథ్యంలో యోగిసర్కార్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి పై రాజద్రోహం కేసు పెట్టడం చర్చనీయాంశం అయింది. రాజద్రోహం కేసు దుర్నియోగం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. సుప్రీం కోర్ట్ సైతం రాజద్రోహం సెక్షన్ కింద కేసులు నమోదు కావడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఆ సెక్షన్ కింద కేసులు పెట్టకుండా ఆగటంలేదు. ఏపీ లో నర్సాపురం ఎంపీ రఘురాంకృషం రాజు పై రాష్ట్ర ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుప్రీం కోర్ట్ బైలు కూడా ఇచ్చింది. తాజాగా యూ పీ లో మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి సమాజావాది పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు అజమ్ ఖాన్ ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా యోగి ప్రభుత్వాన్ని రక్తం తాగే పిశాచిగా అభివర్ణించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రక్తం తాగే పిశాచిగా అభివర్ణించిన యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి (81)పై రాజద్రోహం కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజాం ఖాన్, ఆయన భార్య తంజీమ్ ఫాతిమాలను వారి ఇంట్లో కలుసుకున్న అజీజ్ ఖురేషి అనంతరం మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వాన్ని రక్తం తాగే పిశాచిగా అభివర్ణించారు.

ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన యూపీ బీజేపీ నేత ఆకాశ్ కుమార్ సక్సేనా రాంపూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అజీజ్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని, మత కల్లోలాలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అజీజ్‌పై పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్‌ నేత అయిన అజీజ్ 2014-15 మధ్య మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. అదే సమయంలో యూపీ గవర్నర్‌గానూ కొంతకాలం సేవలందించారు.

Related posts

జార్ఖండ్‌ అడ‌వుల్లో తుపాకుల మోత…ఒక జవాన్ మృతి …మరొకరికి సీరియస్….

Ram Narayana

ఆఫ్ఘనిస్థాన్ లో మసీదుపై ఉగ్రదాడి… 100 మంది మృతి!

Drukpadam

రాజు చనిపోయినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు…హోమ్ మంత్రిని సైతం అడ్డుకున్న వైనం!

Drukpadam

Leave a Comment