బండ్ల గణేశ్ పై మండిపడ్డ జీవిత..అదే స్థాయిలో బండ్ల గణేష్ ఫైర్!

బండ్ల గణేశ్ పై మండిపడ్డ జీవిత..అదే స్థాయిలో బండ్ల గణేష్ ఫైర్!
-చిరంజీవి ఇష్యూపై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది?
-పార్టీలు మారడం నా ఇష్టం బండ్ల గణేశ్ గురించి మాట్లాడటం వేస్ట్

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ కు విచిత్ర పరిస్థితి నెలకొన్నది . మొన్నటివరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడిన బండ్ల గణేష్ కొన్ని అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఆ ప్యానల్ నుంచి వైదొలగి స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం లేకపోలేదు . ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేస్తారని ముందుగానే ప్యానల్ ప్రకటించారు. అంతుకుముందు తాను అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ తో రాజీకి వచ్చి ఆయన ప్యానల్ లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసేందుకు అంగీకరించింది. దీంతో బండ్ల గణేష్ కు చిర్రెత్తుకు వచ్చింది. తాను జీవిత రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి పోటీకి ఒప్పుకోనని తనుకూడా పోటీచేస్తానని ప్రకటించారు. పైగా చిరంజీవిని ఆమె చాలాసార్లు తిట్టారని , పార్టీలు మారారని విమర్శలు గుప్పించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోకి జీవిత రావడంతో ఆ ప్యానల్ నుంచి బండ్ల గణేశ్ బయటకు వచ్చారు. జీవితపై ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాదు, మెగా ఫ్యామిలీని జీవిత ఎన్నోసార్లు కించపరిచారంటూ వివాదాన్ని రాజేశారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై జీవిత కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘మా’ ఎన్నికల గురించి కాకుండా.. చిరంజీవి ఇష్యూపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆమె మండిపడ్డారు. బండ్ల గణేశ్ అంటే తనకు డోంట్ కేర్ అని… ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని అన్నారు. తన బతుకు గురించి ఆయనకు ఏం అవసరమని… తాను పార్టీలు మారితే ఆయనకు వచ్చిన కష్టమేమిటని మండిపడ్డారు. పార్టీలు మారడం తన ఇష్టమని చెప్పారు. మెగా ఫ్యామిలీని ఎంతో మంది విమర్శించి ఉంటారని… వాళ్లందరినీ వెలి వేస్తారా? అని ప్రశ్నించారు. తమ ఆస్తులను అమ్ముకుని చేతనైనంత మందికి సాయం చేశామని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: