ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌భుత్వ‌ కొత్త‌ ప్రధాన కార్యదర్శి గా సమీర్‌శర్మ!

ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌భుత్వ‌ కొత్త‌ ప్రధాన కార్యదర్శి గా సమీర్‌శర్మ!
-ఈ నెల 30న ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం ముగింపు..
-వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌
-అక్టోబర్ 1న స‌మీర్ శ‌ర్మ‌ పదవీ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శగా సమీర్ శర్మ ను ప్రభత్వం నియమించింది. ఇప్పటివరకు సి ఎస్ గా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ నెల చివరివారణ రిటైర్ కానున్నారు.అక్టోబర్ 1న స‌మీర్ శ‌ర్మ‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నీలం సహానీ రిటైర్ అయిన తరువాత ఆదిత్యనాథ్ దాస్ సి ఎస్ గా వచ్చారు. ఇప్పుడు సీనియర్ గా ఉన్న సమీర్ శర్మ ను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గా నియమించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండ‌డంతో కొత్త‌ ప్రధాన కార్యదర్శి గా సమీర్‌ శర్మను నియ‌మిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్ 1న స‌మీర్ శ‌ర్మ‌ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయ‌న‌ 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన ప్ర‌స్తుతం రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌ గవర్నెన్స్‌ సంస్థ వైస్‌ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు.

Leave a Reply

%d bloggers like this: