హైద్రాబాద్ నుంచి లండన్ కు నేరుగా విమానాలు!

హైద్రాబాద్ నుంచి లండన్ కు నేరుగా విమానాలు!
ఇక ఎక్కడా ఆగకుండా హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లిపోవచ్చు!
హైదరాబాద్ నుంచి లండన్ కు నాన్ స్టాప్ సర్వీసులు
ప్రవేశపెట్టిన ఎయిరిండియా
నేటి నుంచి అందుబాటులోకి సర్వీసులు
9 గంటల్లో లండన్ చేరిక

ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలంటే మార్గమధ్యంలో మనదేశంలోని ముంబయ్ ,ఢిల్లీ ,లాంటి నగరాలకు లేదా దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు చేరుకుని అక్కడ్నించి మళ్లీ ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు! హైదరాబాద్ నుంచి లండన్ కు నాన్ స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఎయిరిండియా నేటి నుంచి లండన్ కు నాన్ స్టాప్ సర్వీసులు ప్రవేశపెడుతోంది.

ఈ విమాన సర్వీసులు వారంలో రెండు పర్యాయాలు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ వెళతాయి. ఇవి హైదరాబాద్ నుంచి లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టుకు 9 గంటల్లో చేరుకుంటాయి. గతంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చాలా అధికంగా ఉండేది. ఇప్పుడు ఎంతో సమయం ఆదా కానుంది. ప్రయాణ సమయం సుమారు గంట నుంచి 2 గంటల వరకు తగ్గుతుంది. అంటే కాకుండా వేరే దగ్గర విమానం మారాలంటే కనీసం 3 గంటల వరకు వెయిటింగ్ ఉంటుంది . అందువల్ల చాల సమయం అవుతుంది. టికెట్ ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల లండన్ తో పాటు అమెరికా ,కెనడా లాంటి దేశాలకు కూడా లండన్ నుంచి పోవడం సులువుగా ఉంటుంది.

Leave a Reply

%d bloggers like this: