రమ్య తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చినహోంమంత్రి… అక్కున చేర్చుకుని ఓదార్చిన సీఎం జగన్!

రమ్య తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చిన హోంమంత్రి… అక్కున చేర్చుకుని ఓదార్చిన సీఎం జగన్!
-ఇటీవల బీటెక్ విద్యార్థిని రమ్య హత్య
-ఇప్పటికే 10 లక్షల సాయం అందించిన సర్కారు
-తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్
-రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగం
-రమ్య కుటుంబానికి పొలం, ఇంటి స్థలం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా అంరసరావుపేట లో హత్యకు గురైన రమ్య విషయంలో టీడీపీ ,వైకాపా మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం విదితమే . దీనిపై తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావుపేట వెళ్లేందుకు హైదరాబానించి విమానం లో గన్నవరం చేరుకున్నారు .విమానాశ్రయంలోనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు . దీనిపై టీడీపీ పెద్ద రాదంటమే చేసింది. అయితే కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి జగన్ కలిసేందుకు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. హోమ్ మంత్రి చొరవాత వారి కుటుంబసభ్యులను సీఎం దగ్గరకు తీసుకొచ్చారు.

ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత రమ్య తల్లిదండ్రులను నేడు సీఎం జగన్ వద్దకు తీసుకువచ్చారు. రమ్య హత్యోదంతం, తదనంతర పరిణామాలను వారు సీఎం జగన్ కు వివరించారు. వారి పరిస్థితి పట్ల తీవ్ర సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్… కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు.

రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మరో 10 రోజుల్లో ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందాలని, వారి కుటుంబం తనతో కలిసి సంతోషంగా టీ తాగాలని నిర్దేశించారు. అంతేకాకుండా రమ్య కుటుంబానికి ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల ఇంటి స్థలం కూడా ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు హోంమంత్రి సుచరిత మీడియాకు వివరాలు తెలిపారు.

రమ్య హత్య జరిగిన తర్వాత ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్ ను కూడా ప్రభుత్వం అందించింది.

Leave a Reply

%d bloggers like this: