Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

బిగ్ బాస్ షో పై సిపిఐ నారాయణ తీవ్ర విమర్శలు…

బిగ్ బాస్ షో పై సిపిఐ నారాయణ తీవ్ర విమర్శలు
-యువతకు ఏమి సందేశం ఇస్తున్నారని మండిపాటు
-i‘బిగ్‌బాస్’తో విష సంస్కృతి.. వెంటనే నిలిపేయండి: సీపీఐ నారాయణ
-బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నారాయణ
-అదో బూతుల ప్రపంచమని, వేల కోట్ల రూపాయలకు ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం
-న్యాయవ్యవస్థ, పోలీసులు తనకు సాయం చేయడం లేదని ఆవేదన

బిగ్ బాస్ తెలుగు 5 గత ఆదివారం నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రారంభమైంది .దీనిపై గతంలోనూ ,ప్రస్తుతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా నిర్వాకులు వాటిని గురించి పట్టించుకోవడం లేదు . విఫరీఅతమైన రేటింగ్ తో ఈ షో దూసుకు పోతుంది. అయితే నేర్చుకోవాల్సింది ఏముందో అర్థకామవడంలేదని సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ అన్నారు యువత ను’ పెడదోవ పట్టించే బూతు ప్రపంచమే బిగ్ బాస్ షో అని అందువల్ల దాన్ని నిషేదించాలని ఆయన డిమాండ్ చేశారు.తాను ఈ మేరకు పోలీలులను సైతం ఆశ్రయించానని అయినప్పటికీ అటు నుంచి ఎలాతని స్పందనలేదని ఆయన మండిపడ్డారు .కార్మికులు తమ హక్కులకోసం , కూలీలు కూలి రేట్ల పెంపుకోసం సమ్మెచేస్తే నిర్ధాక్షిణ్యంగా అణిచే పోలీసులకు ,ఇంతో కూర్చొని బూతులు మాట్లాడుతూ రియాలిటీ షో అంటూ దాన్ని టెలికాస్ట్ ప్రభుత్వాలు ఎందుకు అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు ఇలాంటి షో ల వల్ల యువత చెడు మార్గాలు పెట్టె అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఓ తెలుగు టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్’షోపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది సమాజంలో విష సంస్కృతిని పెంచేలా ఉందని దుయ్యబట్టారు. వెంటనే దీనిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి షోలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు. దీనివల్ల ఉపయోగం ఎవరికో చెప్పాలన్నారు. బిగ్‌బాస్ షో అంటేనే బూతుల ప్రపంచమని, దీనిని వేల కోట్ల రూపాయల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్ షోకు అనుమతి నివ్వడం చాలా ఘోరమైన విషయమన్నారు. ఈ షో అనైతికమన్నారు. దీనిని ఆపాలంటూ తాను కోర్టుల్లో కేసులు వేసినా న్యాయవ్యవస్థ కానీ, పోలీసులు కానీ తనకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇలాంటి దారుణ షోలకు అనుమతినివ్వడం మానుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.

Related posts

లుథియానా కోర్టులో పేలుడు కేసు…అనుమానితుడి గుర్తింపు!

Drukpadam

‘ది కశ్మీర్ ఫైల్స్’రికార్డులే రికార్డులు..14 రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూలు!

Drukpadam

రసవత్తరంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోషివేషన్ ఎన్నికలు!

Drukpadam

Leave a Comment