విజయ్ రూపాని రాజీనామా చేశారా ? చేయించారా??

విజయ్ రూపాని రాజీనామా చేశారా ? చేయించారా??
-గుజరాత్ సీఎం ఆకస్మిక రాజీనామా వెనక అసలు కారణం ఏమిటి ?
-మరో సంవత్సరం లో ఎన్నికలు జరగనుండగా రాజీనామా చేయడం ఏమిటి ??
-పటేల్ సామాజికవర్గానికి చెందినవారికి సీఎం పదవి ఇవ్వడం కోసమే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా ???

బీజేపీ పట్టు తగ్గుతుందా ? అందుకే వరసగా వివిధ రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులను రాజీనామాలను చేయిస్తుందా ? ఇప్పటికే మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చిన బీజేపీ గుజరాత్ లో మార్చేందుకే రూపనిచేత రాజీనామా చేత చేయించిందా ? లేక ఆయనే చేశారా ? అనే సందేహాలు నెలకొన్నాయి. రూపాని మీద గుజరాత్ లో పెద్ద వ్యతిరేకత లేదు .అలాఅని ఆయన వల్ల బీజేపీ కి అడ్వాంటేజ్ కూడా లేదనే అభిప్రాయాలే ఉన్నాయి. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఆయన చేత రాజీనామా చేయించిందనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి. ప్రధానికి మోడీకి ,హోమ్ మంత్రి అమిత్ షా కు నమ్మకస్తుడు గా రూపాని ఉన్నారు. గత ఎన్నికల్లో రూపాని ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లారు . హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారం చేపట్టింది. అప్పుడే సీఎం గా పటేల్ సామాజికవర్గం నుంచి పెట్టాలనే అభిప్రాయాలూ వచ్చాయి. కానీ మోడీ ,అమిత్ షా హావ కేంద్రం లో కొనసాగుతుండటంతో వారు తిరిగి సౌమ్యుడైన రూపాని వైపే మొగ్గుచూపారు. పటేల్ వర్గం కొంత అసంతృప్తి తో ఉంది. మరో సంత్సరం లో ఎన్నికలు జరగనుండగా రూపాని నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళితే ఇబ్బందులు తప్పవని నిఘావర్ఘాలు హెచ్చరించాయి. పైగా కేంద్రంలో పూర్తీ మెజార్టీ తో బీజేపీ ఉన్నసప్పటికీ ప్రజల్లో కొంత పట్టు సడలినట్లు వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు నిరూపిస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకత్వం తమకు కీలక రాష్ట్రమైన గుజరాత్ ను తిరిగి నిలబెట్టుకోవాలంటే ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయానికి వచ్చి మార్పు కు శ్రీకారం చుట్టారని పరిశీలకులు అంటున్నారు. 2022 లో జరిగే ఎన్నికలు కేంద్రంలో ఉన్న బీజేపీ కి రిహార్సల్ లాంటివి . అందువల్ల యూ పీ గాని ఉత్తరాఖండ్ గాని బీజేపీ చేజారకుండా చూడాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వం పావులు కదుపుతుంది.

గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఆదివారం గాంధీనగర్ లో సమావేశం అవుతుంది. కేంద్రం నుంచి నూతన ముఖ్యమంత్రిని ఎన్నికునేందుకు అధిష్టానం పరిశీలకులను పంపనుంది . పటేల్ వర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ ముఖ్యమంత్రి రేసులో ముందు ఉన్నారు. ఒకేవేళ ఆయన కాకుంటే మన్సుఖ్ మాండవీయ (ప్రస్తుత కేంద్రమంత్రి ఆర్సీ ఫాల్దు (గుజరాత్ మంత్రి) లలో ఒకరికి అవకాశం ఉంటుందని అంటున్నారు. రేపు గుజరాత్ లో ఏమి జరుగుతుంది. ఎవరిని సీఎం చేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. …

Leave a Reply

%d bloggers like this: