Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పటేల్ సామాజికవర్గానికి గుజరాత్ సీఎం సీటు …నూతన సీఎం గా భూపేంద్ర పటేల్!

పటేల్ సామాజికవర్గానికి గుజరాత్ సీఎం సీటు …నూతన సీఎం గా భూపేంద్ర పటేల్!
-గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ను ఈంనుకున్నట్లు పరిశీలకుల వెల్లడి
-సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ
-గుజరాత్ కొత్త సీఎం కోసం బీజేపీ కసరత్తులు
-రాష్ట్రానికి బీజేపీ పరిశీలకులలుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి
-భూపేంద్ర పటేల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు

ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం అనుకున్నది చేసింది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు సిద్దమౌతున్న వేళ రాష్ట్రంలో బలమైన సామాజికవర్గమైన పటేల్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని గ్రహించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ముఖ్యమంత్రి విజయ్ రూపాని చేస్తా రాజీనామా చేయించి పటేల్ వర్గానికి చెందిన భూపెద్ర పటేల్ ను ముఖ్యమంత్రి గా ఎంపిక చేసింది.రిజర్వేషన్ల ఉద్యమనేత బలమైన నాయకుడుగా గుర్తింపు పొందిన హార్థిక్ పటేల్ కాంగ్రెస్ లో ఉండటంతో ఈసారి ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించిన బీజేపీ అదేసంజికవర్గానికి చెందిన అభ్యర్థిని పెట్టాలని నిర్ణయించింది. ముందుగానే భూపేంద్ర పటేల్ పేరు అధిష్టానం ఎపికచేసి ఎమ్మెల్యేల చేత ఒకే అనిపించుకున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో జరిగింది. కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి లు హాజరైయ్యారు.

గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును అధిష్టానం సూచనమేరకు అవుట్ గోయింగ్ సీఎం విజయ్ రూపాని ప్రదిపాదించగా ఎమ్మెల్యేలు ఆమోదించారు. సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక కోసం నేడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఘట్లోడియా నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ హైకమాండ్ పరిశీలకులుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ ను బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల అభీష్టాన్ని గౌరవిస్తున్నట్టు పరిశీలకుల హోదాలో హాజరైన తోమర్, జోషి పేర్కొన్నారు. ఈ సమావేశంలో విజయ్ రూపానీ, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు.

Related posts

యాత్రలను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు: బొత్స సత్యనారాయణ!

Drukpadam

ఢిల్లీ నుంచి కాదు హైద్రాబాద్ నుంచే చక్రం తిప్పుతాం …మంత్రి కేటీఆర్

Drukpadam

కశ్మీరీ పండిట్ల వలసలకు నేనే కారణమని రుజువైతే.. నన్ను ఉరితీయండి: ఫరూఖ్ అబ్దుల్లా

Drukpadam

Leave a Comment