Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

“అబ్బా జాన్” అంటూ ఓ వర్గం వారిపై యూపీ సీఎం పరోక్ష వ్యాఖ్యలు…

“అబ్బా జాన్” అంటూ ఓ వర్గం వారిపై యూపీ సీఎం పరోక్ష వ్యాఖ్యలు… మండిపడుతున్న విపక్షాలు
లక్నోలో నిన్న కార్యక్రమం
పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్
ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు
విద్వేషం వెళ్లగక్కందే ఎన్నికలకు వెళ్లలేరా అంటూ ఒమర్ వ్యాఖ్యలు

అబ్బా జాన్ మాటలు ఇప్పుడు యూ పీ లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ కి చెందిన ఆరాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లింలను ఉద్దేశించిచేసిన మాటలపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల స్తానం లో ఉంది ఒక సామాజికవర్గాన్ని కించపరిచెమటలు అనడంపై మండిపడుతున్నారు. అబ్బా జాన్ అనే సామాజికవర్గం రేషన్ బియ్యం తీసుకోని దేశ సరిహద్దులు దాటించేవారని ,ఇప్పుడు వారు పప్పులు ఉడకటం లేదని యోగి అనడం పై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల మీద విద్యేషం వెళ్ళగక్కా కుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లలేదని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

ఓ సామాజిక వర్గం వారిని ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లక్నోలోని ఖుషీ నగర్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ, అబ్బా జాన్ అని పిలుచుకునేవారు రేషన్ సౌకర్యాన్ని బాగా వినియోగించుకునేవారని, 2017 ముందువరకు ఆ సరుకులు దేశ సరిహద్దులు దాటి నేపాల్, బంగ్లాదేశ్ వెళ్లేవని అన్నారు. ఇవాళ ఆ పరిస్థితులను అరికట్టామని, అక్రమ రేషన్ పొందేవారిని జైల్లో వేస్తున్నామని తెలిపారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం యోగిపై నేషనల్ కాన్ఫరెన్స్, బీఎస్పీ, సమాజ్ వాదీ తదితర రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ముస్లింలపై విద్వేషం వెళ్లగక్కకుండా బీజేపీ ఏ ఎన్నికలకు వెళ్లదా? అని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితి చూస్తే అలాగే ఉందని విమర్శించారు. హిందువుల రేషన్ ను ముస్లింలు తింటున్నారని ఓ సీఎం చెప్పడం, ఆయనే స్వయంగా ఓట్లు అడగడం ఈ వీడియోలో చూడండి అని పేర్కొన్నారు. ఈ మేరకు యూపీ సీఎం మాట్లాడిన మాటల తాలూకు వీడియోను ఒమర్ పంచుకున్నారు.

Related posts

బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే నితీశే రాష్ట్రపతి అభ్యర్థి అవుతారు: ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్!

Drukpadam

ఏపీ ఎన్నికల పై స్టే రద్దు…ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Drukpadam

హైద‌రాబాద్‌లో న్యూఇయ‌ర్ వేడుక‌లు .. పీక‌లదాకా తాగి రెచ్చిపోయిన‌ అమ్మాయి..

Drukpadam

Leave a Comment