Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సాయిధరమ్ తేజ్ ప్రమాదం… మీడియా స్పందించినతీరు పై తీవ్ర అభ్యంతరాలు!

సాయిధరమ్ తేజ్ ప్రమాదం … మీడియా స్పందించినతీరు పై తీవ్ర అభ్యంతరాలు!
-దేశంలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యలు
-సాయిధరంతేజ్ కథనాలనే ప్రసారం చేయడంపై కొన్ని చానళ్ళు పోటీపడ్డవాని విమర్శలు
-ప్యానల్ డిబేట్లు పెట్టి వారిని హింసించేలా ప్రశ్నలు అడగటంపై మండి పడుతున్న వీక్షకులు
-అదే సందర్భంలో హైద్రాబాద్ లో 6 సంవత్సరాల బాలిక పక్కటింట్లో విగత జీవిగా పడిఉన్నసంఘటన లైట్ గా తీసుకున్న వైనం

యువ సినీ నటుడు సాయిధర్మతేజ్ ప్రమాదం చింతించ దగ్గ విషయం . అయితే అదృష్ట వశాత్తు ఆయన పెద్దగా ప్రమాదం లేకుండానే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు . ఆయనకు పెద్దగా దెబ్బలు తగలలేదని ఒళ్ళు చిరాకపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆయన ప్రాణానికి ఇలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు , పవన్ కళ్యాణ్ తెలిపారు. అయినప్పటికీ మన మీడియా మాత్రం ఆయన ఆక్సిడెంట్ పై చేసిన హడావుడి బ్రేకింగ్ న్యూసులపై వీక్షకుల్లో పలచబడ్డారు . ఇది మంచిది కాదని ,అనేక వార్తలు ఉండగా ఒక చిన్న ఆక్సిడెంట్ పై అతిగా స్పందించడం సమాజానికి మంచిది కాదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రమాదంపై మీడియా తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. రెండు రోజులపాటు కొన్ని చానళ్ళు దీన్నే పట్టుకొని సాగదీయడంపై వీక్షకులు మండిపడుతున్నారు. ఆయన ప్రమాదం చిన్నదే అనే విషయం తెలిసి కూడా అతిగా స్పందించడం ఏమిటనే చర్చ ప్రజాబాహుళ్యంలో జరుగుతుంది. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన కూడా మనిషేకదా ఆకోణంలో ఎందుకు చూడటంలేదు. సాయిధరంతేజ్ కు ప్రమాదం జరగటం చింతాల్సిన విషయమే! ఆయన అతిత్వరగా కోలుకోవాలని కోరుకోవటంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదు . ఆమేరకు మీడియా స్పందించడం అర్థం చేసుకోవచ్చు .కానీ దేశంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ,ఎక్కడ జరగనట్లు , చూపించడం,దానిపై ప్రత్యేక డిబేట్లు పెట్టి ఉదరగొట్టటంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సందర్భంలో హైద్రాబాద్ లో ఒక మైనర్ బాలికపై పక్కిఇంట్లో ఒళ్ళు గగుర్పొడిచేవిధంగా విగత జీవిగా పడిఉన్న బాలిక విషయం చాల చిన్న విషయమన్నట్లు చూడటం ,దాన్ని గురించి పట్టించుకోకపోవడం పై ప్రజలు మండి పడుతున్నారు. రోజు తిండికి లేక అల్లాడుతున్న ప్రజల గురించి వైద్యం అందక చనిపోతున్న పేదల గురించి పట్టించుకోని ప్రసారం చేసి మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని ,కూలీపనులకోసం దేశం గాని దేశం వెళ్లి అక్కడే అసువులు బాస్తున్న అనేక మండి గురించి ప్రత్యేక కథనాలు వస్తే బాగుండునని సామాన్యలు ఆవేదన .

ఆయనకు అక్సిడెంట్ అయినదగ్గరనుంచి ఆయన్ను ఎవరెవరు చూసేందుకు వస్తున్నారు. ఆయన్ను ఏ డాక్టర్లు చూస్తున్నారు. ఆయన వాడిన బైక్ ఏమిటి ? అది ఎంత స్పీడ్ పోతుంది. అక్కడ ఇసుక ఉందా? అందువల్లనే స్కిడ్ అయి పడిపోయాడా? అధికంగా స్పీడ్ పోవడంవల్లనే ప్రమాదం జరిగిందా ? ,దాని స్పీడ్ అప్పుడు ఎంత ఉంది, 70 ఉందని అంటే ,మరొకరు లేదు లేదు 120 వేగంతో పోతున్నాడని, అద్నువల్లనే ప్రమాదం జరిగిందని మాధ్యమాల్లో వార్తలు రావడం కూడా తీవ్ర అభ్యంతరాలకు దారితీసింది. ఇక లైవ్ డిబేట్లలో డాక్టర్లు , యాక్టర్లు , విశ్లేషకులు ,ఒకరేమిటి రకరకాల వారితో ప్యానల్ డిస్కషన్ పెట్టి దేశంలో ఏ సమస్య లేదన్నట్లు చర్చించడం పై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనకు ఆక్సిడెంట్ జరిగిన విషయం చెప్పటం వరకు ఒకే .కానీ ఆయన హెల్త్ కండిషన్ ఎలావుందీ అనేది ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ తో రేటింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేశారని విమర్శలు వచ్చాయి.

ఒక ఛానల్ లో లైవ్ డెబిట్ లో గతంలో ఇలాంటి ఆక్సిడెంట్ అయి తన కుమారుడిని కోల్పోయిన ఒక సెలబ్రిటిని కూర్చోబెట్టి ఆయన అభిప్రాయం తీసుకోవడం తిరిగి అయన మనసు గాయపరచడం , ఆ తరువాత డాక్టర్లను కూర్చోబెట్టి ధర్మతేజ్ వచ్చినప్పుడు ఏ కండిషన్ లో వచ్చారు .మీరు ఏలాంటి ట్రేటిమేట్ ఇచ్చారు.అని అడగటం పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. అసలు ఆయనకు పెద్ద దెబ్బలు ఏమి తగలలేదని ఆయన తలకు హెల్మెట్ పెట్టుకొని ఉండటం వల్ల హెడ్ ఇంజురీ ఏమి కాలేదని త్వరలో కొలు కుంటారని ఒక పక్క డాక్టర్లు చెబుతున్న ,ఆయన ఇంకా స్పృహలోకి రాలేదని అందువల్ల ఆయన కండిషన్ ఇప్పుడే చెప్పలేమని ఆయన కండిషన్ పై డౌట్ వచ్చే విధంగా ప్రసారం చేయడం పై కూడా ఛానల్స్ క్రేడిబులిటీ తగ్గిపోండుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Related posts

బీజేపీ ,టీఆర్ యస్ లకు బుద్ది చెప్పండి…సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

Drukpadam

మినిమమ్ బ్యాలెన్స్’ పేరుతో బ్యాంకుల వేల కోట్ల బాదుడు.. పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

Ram Narayana

రెండు రోజుల పాటు మూత పడ‌నున్న తిరుమ‌ల ఆల‌యం.. కార‌ణాలివే!

Drukpadam

Leave a Comment