సీఎం ఆదిత్యనాథ్ “అబ్బా జాన్” వ్యాఖ్యలపై మండిపడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా…

సీఎం ఆదిత్యనాథ్ “అబ్బా జాన్” వ్యాఖ్యలపై మండిపడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా…
-ఇటీవల “అబ్బా జాన్” అంటూ యూపీ సీఎం వ్యాఖ్యలు
-హిందువుల రేషన్ తినేస్తున్నారంటూ ఓ వర్గంపై విమర్శలు
-యూపీ సీఎం వ్యాఖ్యలపై దుమారం
-తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నసీరుద్దీన్ షా

ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ సామాజిక వర్గం వారిని ఉద్దేశించి “అబ్బా జాన్” అని పిలుచుకునేవాళ్లు హిందువుల రేషన్ ను తినేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కూడా సీఎం ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అబ్బా జాన్” అంటూ యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు కనీసం స్పందించడానికి కూడా తగినవి కావని అన్నారు. ధిక్కరణ పూరిత వ్యాఖ్యలుగా పరిగణించాల్సి ఉంటుందని నసీరుద్దీన్ షా విమర్శించారు.

“ఆయనేంటి, ఆయన స్థాయి ఏంటి? ఇలాగేనా మాట్లాడేది? ఈ వ్యాఖ్యలపై ఏమని స్పందించాలి? అయితే ఒక్క విషయం స్పష్టమవుతోంది. “అబ్బా జాన్” అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తన విషం చిమ్మే కార్యాచరణకు కొనసాగింపు అని తెలుస్తోంది” అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

%d bloggers like this: