ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యం…. :విధుల్లో చేరిన పోలీసులు

ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యం… :విధుల్లో చేరిన పోలీసులు 
మ‌ళ్లీ విధుల్లో చేరిన ఆఫ్ఘ‌నిస్థాన్ పోలీసులు
తాలిబ‌న్ల పిలుపుతో విధుల్లోకి
కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద మీడియాతో మాట్లాడిన పోలీసులు
తాలిబ‌న్ క‌మాండ‌ర్లు త‌మ‌కు ఫోన్ చేశార‌ని వివ‌ర‌ణ

ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యం మొదలైంది. అయితే ఆఫ్ఘన్ పోరాటంలో తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న ఉద్యోగులు , ప్రత్యేకించి పోలీసులు విధులకు దూరంగా ఉన్నారు. వ్యవస్థ నడవాలంటే ఉద్యోగులు కీలకం అందువల్ల తాలిబన్ కమాండర్లు ఉద్యోగులను విధులకు రావాలని కోరారు. అంతేకాదు పోలీసులను సైతం వెంటనే విధుల్లో చేరాలని పాట ఉద్యోగులను ఎవరిని తీసేయబోమని ప్రకటించడంతో పోలీసులు విధుల్లో చేరి ఉద్యోగాలు చేసుకొంటున్నారు. దీంతో ఇప్పటివరకు అస్తవ్యస్తంగా ఉన్న కాబుల్ వీధుల్లో పోలీసులు డ్యూటీలో కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొద్దీ రోజుల్లోనే పాలన గాడిలో పెట్టె పనిలో నిమగ్నమైయ్యారు .

ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల వ‌శ‌మైన విష‌యం తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా ఆ దేశంలోని పోలీసులు విధుల‌కు దూరం ఉంటున్నారు. అయితే, తాలిబ‌న్ల పిలుపుతో పోలీసులు మ‌ళ్లీ విధుల్లో చేరారు. ప‌లు ప్రాంతాల్లో ఆఫ్ఘ‌న్ పోలీసులు తాజాగా విధులు నిర్వ‌హిస్తూ క‌న‌ప‌డ్డారు.

తాలిబ‌న్ క‌మాండ‌ర్ల‌ పిలుపు మేర‌కు మ‌ళ్లీ విధుల్లో చేరిన‌ట్లు మీడియాకు తెలిపారు. కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తోన్న పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా తాలిబ‌న్ క‌మాండ‌ర్లు త‌మ‌కు ఫోన్ చేశార‌ని, విధుల్లోకి రావాల‌ని చెప్పారని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో తిరిగి తాము మ‌ళ్లీ విధుల్లో చేరడం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ప్రస్తుతం మ‌ళ్లీ విమానాశ్ర‌మంలోని ప్ర‌ధాన భ‌వ‌నాలతో పాటు చెక్ పాయింట్ల వ‌ద్ద పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.

అనేక కార్యాలయాలు ఇప్పటికి బోసిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎప్పటికి తిరిగి కాబుల్ పూర్వస్థితిలోకి వస్తుందనే దానిలో ప్రజలు ఉన్నారు. తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉన్నారన్న వారిపై నిఘా ఏర్పాటు చేశారు. పంజ్ షేర్ లో ఇంకా తాలిబాన్లకు పంజ్ షేర్ యోధులకు మధ్య వార్ జరుగుతేనే ఉంది. ఆఫ్ఘన్ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆశక్తిగా గమనిస్తున్నాయి.

Leave a Reply

%d bloggers like this: