Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఎం జగన్ బెయిల్​ రద్దు చేయాలన్న పిటిషన్​ ను వేరే కోర్టుకు బదలాయించండి: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్​!

ఏపీ సీఎం జగన్ బెయిల్​ రద్దు చేయాలన్న పిటిషన్​ ను వేరే కోర్టుకు బదలాయించండి: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్​!
-వారిద్దరి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో గతంలో పిటిషన్
ఇటీవలే విచారణ పూర్తి
-రేపు తుది ఆదేశాలివ్వనున్న కోర్టు
-పిటిషన్ ను కొట్టేసిందన్న వార్తల నేపథ్యంలో హైకోర్టుకు రఘురామ
-కోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందే వార్త ప్రచురించారని ‘సాక్షి’పై రఘురామ పిటిషన్… తీర్పు రేపటికి వాయిదా
-జగన్ బెయిల్ రద్దు కోరుతూ గతంలో రఘురామ పిటిషన్
-ఆ పిటిషన్ ను కొట్టివేశారని సాక్షిలో వార్త!
-ఇది కోర్టు ధిక్కరణ అంటూ రఘురామ ఆరోపణ
-సాక్షిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
-లక్షన్నర జీతం వచ్చే విజయసాయిరెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఎలా వచ్చారు?
-ప్రత్యేక విమానంలో రావాలంటే రూ. 15 లక్షలు అవుతుంది
-ఈ విషయంపై జగన్ ఆలోచించాలి
-భారీ ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టినప్పుడు ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకుంది?

ఏపీ సీఎం జగన్ , ఎంపీ విజయసాయి రెడ్డి టార్గెట్ గా ఎంపీ రఘురామకృష్ణమరాజు చేస్తున్న పోరాటంలో వారిబాయిల్ రద్దు చేయాలనీ కోర్ట్ ను ఆశ్రయించారు. వారికేసుకు రఘురామకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి జగన్ , విజయసాయి టార్గెట్ గా వ్యవరిస్తున్నారని జగన్ తరుపున లవ్యర్ల వాదన ఏది ఏమైనా రేపు బెయిల్ పై సిబిఐ కోర్ట్ తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రఘరామ తన పిటిషన్ వేరే కోర్టుకు బదలాయించామని కోరడం ఆశక్తిని రేకెత్తిస్తుంది. కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ నెలకొన్నది.

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతుండగానే పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. వారి బెయిల్ రద్దు పిటిషన్ ను మరో కోర్టుకు బదలాయించాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లెక్కారు.

జగన్, విజయసాయిల బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ విచారణను ఇటీవలే పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. రేపు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే రేపు సీబీఐ కోర్టు ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని ఆయన కోరారు. పిటిషన్ ను అత్యవసర విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఆ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు ఆమోదం తెలిపింది.

జగన్ బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేశారంటూ ఇటీవల సాక్షిలో వార్త వచ్చిందంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందే వార్త ప్రచురించారంటూ రఘురామ హైదరాబాదు సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ రఘురామ తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టు నేడు విచారణ చేపట్టగా, వాదనలు ముగిశాయి. సీబీఐ న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.

కాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. సాదాసీదా జీవితం గడుపుతున్నానని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ఈరోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చినట్టు తెలిసిందని ఆయన అన్నారు.

సొంత డబ్బులతో ఢిల్లీకి ప్రత్యేక విమానంలో రావాలంటే రూ. 15 లక్షలు ఖర్చవుతుందని… విజయసాయికి అంత డబ్బు ఎవరు కట్టారని ప్రశ్నించారు. విజయసాయికి నెలకు లక్షన్నర రూపాయల జీతం వస్తుందని… అలాంటి వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా ప్రయాణించగలరని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం విజయసాయిని ప్రత్యేక విమానంలో పంపించిందా? అని అడిగారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై రఘురాజు విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టామని విజయసాయి చెబుతున్నారని… మరి, అంత భారీ ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టినప్పుడు జాబితాలో ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకుందని ఎద్దేవా చేశారు.

Related posts

365 రకాల వంటకాలతో కాబోయే వధూవరులకు తాతయ్య సంక్రాంతి విందు…

Drukpadam

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉందా?

Drukpadam

ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాస్ రావు బదిలీ… నెరవేరిన సిపిఐ కోరిక…

Drukpadam

Leave a Comment