Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం కేటీఆర్ సవాల్ … దమ్ముంటే కేసీఆర్ ను సవాల్ విసరమను అప్పడు చూస్తా బండి సంజయ్!

కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం కేటీఆర్ సవాల్ … దమ్ముంటే కేసీఆర్ ను సవాల్ విసరమను అప్పడు చూస్తా బండి సంజయ్!
-కేటీఆర్ ఓ అజ్ఞాని తుపాకీ రాముడు అంటూ బండి సంజయ్ ఎద్దేవా
-నేను చెప్పినవి తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్
-కేంద్రం ఇచ్చినదానిపై చర్చకు రావాలని బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్
-ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం…కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని వెల్లడి
-కేటీఆర్ కు రాజ్యాంగం తెలియదని బండి సంజయ్ విమర్శలు… రాష్ట్రంన్నీ అప్పుల మార్చారంటూ ఆగ్రహం

కేటీఆర్ …..

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బండి సంజయ్ చర్చకు రావాలని అన్నారు. నేను చెప్పినవి తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా… మీరు చెప్పినవి తప్పు అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని వ్యాఖ్యానించారు.

గత ఆరున్నరేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ రూపంలో రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారో మీరే చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు. సొల్లు కబుర్లు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

బండి సంజయ్ …..

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని, ఎవరిది తప్పయితే వారు రాజీనామా చేయాలని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ కాదు… కేసీఆర్ సవాల్ విసిరితే అప్పుడు చూస్తానని అన్నారు. కేటీఆర్ ఓ అజ్ఞాని అని, తుపాకీ రాముడు అని ఎద్దేవా చేశారు. యూపీఏ కంటే ఎన్డీయేనే రాష్ట్రానికి 9 శాతం అధికంగా నిధులు ఇచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందని వెల్లడించారు. కేటీఆర్ కు రాజ్యాంగం తెలియదని విమర్శించారు. ఒక్కో తెలంగాణ వ్యక్తిపై లక్ష రూపాయల అప్పు చేసినందుకు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు కేటీఆరే రాజీనామా చేయాలని అన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టిన కపిల్ సిబాల్…

Drukpadam

ఆ విషయంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరు: రేవంత్ రెడ్డి

Drukpadam

ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అవకాశం ఇస్తే పోటికి సిద్ధం:కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్

Drukpadam

Leave a Comment