సింగరేణి కాలనీ లో సంఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం …నిందితున్ని కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరిక!

సింగరేణి కాలనీ లో సంఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం …నిందితున్ని కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరిక!
-వాడిని ఎన్ కౌంటర్ చేయాల్సిందే: మంత్రి మల్లారెడ్డి
-ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుడు
-త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని వ్యాఖ్య
-మంత్రులు ఎవరు పరామర్శించలేదని కాంగ్రెస్ విమర్శ

హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మరోవైపు ఆ చిన్నారి కుటుంబసభ్యులను రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నేతలతో పాటు సినీ నటుడు మంచు మనోజ్ కూడా పరామర్శించారు.

ఈ హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని చెప్పారు. నిందితుడిని పట్టుకుని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తామని అన్నారు. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పారు.

ఇప్పటికి వరకు మంత్రులు ఎవరు వచ్చి భాదిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క , టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత సహాయం కూడా అందించారు. దీంతో సైదాపేట సింగరేణి కాలనీ ప్రజలు నిందితుడిపై గుర్రుగా ఉన్నారు . ఆరు సంవత్సరాల బాలిక పక్కింట్లో విగత జీవిగా పడిఉండటాన్ని స్థానిక ప్రజలు కళ్ళరా చుసిన స్నాఘటనపై ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నేరుగా నిందితున్ని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పడం పై కూడా విస్మయం వ్యక్తం అవుతుంది. భాద్యత యుతమైన పదవిలో ఉన్న మంత్రి ఎన్కౌంటర్ చేస్తామని చెప్పడం పై అబ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హైద్రాబాద్ లో ఎలాంటి ఘటనలు గత కొంత కాలంగా జరుగుతుండటంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

%d bloggers like this: